Advertisementt

కొరటాల చెప్పిన..సమంత, నిత్యల ప్రాబ్లమ్స్!

Wed 21st Sep 2016 08:57 PM
janatha garage,koratala siva,samantha,shruti haasan,janatha garage promotion  కొరటాల చెప్పిన..సమంత, నిత్యల ప్రాబ్లమ్స్!
కొరటాల చెప్పిన..సమంత, నిత్యల ప్రాబ్లమ్స్!
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' రిలీజ్ అయిన దగ్గర నుండి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ ఫుల్ హ్యాపీ గా వున్నారు. అంతే ఉత్సాహం తో ఈ సినిమా ప్రొమోషన్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఇంకా థాంక్స్ మీట్, అభిమానుల కోసం 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ అంటూ తెగ హడావిడి చేశారు. 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా నిత్య మీనన్, సమంతలు నటించగా... కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఇక్కడ మీరొక విషయం డీప్ గా గమనించారా.. అదేమిటంటే హీరోయిన్స్ ఇద్దరూ సినిమా విడుదల తర్వాత అస్సలు కలవలేదంట. సినిమా విడుదలయ్యాక కలవడం, కలవకపోవడం ఏమిటి అంటారా అదేనండి... సినిమా విడుదలకు ముందు సమంత 'జనతా గ్యారేజ్' ప్రమోషన్ లో పాల్గొంటే... సినిమా విడుదలయ్యాక నిత్య మీనన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. మరి వీరిద్దరూ కలిసి 'జనతా గ్యారేజ్' కి సంబందించి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక థాంక్స్ మీట్ లో సమంత పాల్గొనగా.... సక్సెస్ మీట్ లో నిత్యామీనన్ పాల్గొంది. అయితే వీరిద్దరి మధ్య ఏదో... జరిగిందని అందరూ తెగ చెవులు కొరుక్కుంటున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందో కానీ 'జనతా గ్యారేజ్' దర్శకుడు శివ మాత్రం ఇలా చెబుతున్నాడు.

సినిమా రిలీజ్ ముందు నిత్యాని ట్రైలర్స్ లో ఎక్కువగా చూపించక పోవడంతో నిత్యా అలిగింది అందుకే నిత్య అప్పుడు రాలేదని అందరూ అన్నారు. అయితే శివ మాత్రం 'జనతా గ్యారేజ్' రిలీజ్ టైం కి నిత్య వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోవడం వల్ల ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనలేక పోయిందని... ఇక రిలీజ్ తర్వాత ఆ బాధ నుండి బయటపడి ఉత్సాహం గా పబ్లిసిటీ లో పాల్గొందని క్లారిటీ  ఇచ్చాడు. 

ఇక సమంత విషయం లో కూడా సేమ్ ఇదే జరిగింది. సినిమా రిలీజ్ అయ్యాక సమంత రోల్ కి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదని అందుకే హిట్ పోస్టర్స్ లో సమంత ఫొటోస్ ని వెయ్యకుండా స్పెషల్ సాంగ్ లో నటించిన కాజల్ ని మాత్రమే వేశారని.... ఈ విషయమై సమంత కూడా అలిగింది ప్రచారం జరిగింది. కానీ కొరటాల మాత్రం సమంత గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాడు.. సమంత 'జనతా గ్యారేజ్' రిలీజ్ అయ్యాక హైదరాబాద్ లో లేదని అందుకే ప్రమోషనల్ ఈవెంట్స్ పాల్గొనలేక పోయిందని అంటున్నాడు. మరి కొరటాల చెప్పింది నిజమని అందరూ నమ్ముతారంటారా. లేక మరో వాదనని బయటికి తీసుకు వస్తారా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ