ఇంకేంటి అక్టోబర్ లో, దసరాకి ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెగ ఊదర గొట్టారు. ఈ దసరాకి ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్లోకి కొత్త మంత్రులు ఎంటర్ అవుతారని తెగ ప్రచారం జరిగింది. అది ఇప్పుడు కొంచెం ఆలస్యమయ్యేటట్టు కనబడుతుంది. ఎందుకంటే అది చంద్రబాబు కుమారుడు లోకేష్ వల్లే ఈ విస్తరణ కు టైం పడుతుందని అంటున్నారు. అదేమిటి లోకేష్ బాబుకి కూడా మంత్రి పదవి వస్తుండగా ఇక ఆలస్యమెందుకు అదేదో జరిపెయ్యొచ్చుగా అంటారా. అలా జరపడానికి ఇప్పుడు కుదిరేలా లేదట అందుకే కొంచెం వాయిదా పడే సూచనలున్నాయని అంటున్నారు.
మరి టిడిపిలో... లోకేష్ మంత్రి వర్గం లోకి రావాలని ఎవరికీ వారు తమ తమ ఎమ్యెల్సీ, ఎమ్యెల్యే పదవులు వదులుకోవడానికి సిద్దపడి.... త్యాగాలు చెయ్యడానికి రెడీ అయిపోయారు, ఎందుకంటే అలా తమ, తమ స్థానాలలో లోకేష్ గనక పోటీ చేసి మంత్రి అయితే తమ నియోజక వర్గాలు బాగుపడతాయని కొంతమంది టిడిపి నేతలు తెగ డప్పు వాయించేశారు. ఇదంతా చంద్ర బాబు మొప్పుకోసమే అని అందరికి తెలుసనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ మంత్రి వర్గం లో లోకేష్ ఉండాలని చాలామంది నేతలు పట్టుపడుతున్నారు గనక... లోకేష్ కి మంత్రిపదవికి ఖాయం చెయ్యాలని బాబు అనుకోవడం.. అందుకే మంత్రి వర్గ విస్తరణని చేపట్టడానికి రెడీ అవ్వడం జరిగాయని కొందరంటున్నారు. ఇలా ఏదో ఒక మంత్రి పదవినిచ్చేసి తన రాజకీయ వారసుడిగా సీఎం ని చేసెయ్యొచ్చని చంద్రబాబు పథకం రచించాడు.
అయితే లోకేష్ ని గనక ఇప్పుడు మంత్రిని చేస్తే ఎమ్యెల్సీగా 6 నెలల లోపు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే 2017 వరకు ఎమ్యెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే ప్రసక్తే లేదు. మరి ఇప్పుడు గనక మంత్రి వర్గం లోకి లోకేష్ ని తీసుకుంటే ఆ వ్యవధి సరిపోదు గనక మంత్రి వర్గ విస్తరణని నవంబర్ వరకు పోస్ట్ పోన్ చెయ్యొచ్చని అంటున్నారు. అందుకే ఈ ఆలస్యమనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఒకవేళ ఎమ్యెల్యే గా పోటీ చేద్దామంటే ఏదో ఒక స్థానం ఖాళీ అవ్వాలి. అలా ఖాళీ చేస్తామని కొంతమంది నేతలు చెబుతున్నప్పటికీ వీరు ఖాళీ చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలిగా... అందుకే కొన్ని రోజులు ఆగి విస్తరణ చేపడతామని చంద్రబాబు అంటున్నాడని చెబుతున్నారు.
మరి చంద్రబాబు కొడుకు లోకేష్ కారణం గా.... తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న జంపింగ్ ఎమ్యెల్యేలకు కొంత నిరాశ కలిగిందని సమాచారం. ఇప్పటికే వీరు ఏదో ఒక పదవిని అనుభవించేద్దామని మరీ ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వచ్చారు. పాపం మళ్ళీ మరికొంత కాలం వెయిట్ చెయ్యక తప్పేలా లేదు.