ఏదైనా వేడుకలకు యాంకరింగ్ చేసేటప్పుడు ఆయా యాంకర్లు ఆచితూచి మాట్లాడాలి. తమ వ్యాఖ్యానంలో తప్పు దొర్లితే వారు నవ్వులపాలు కావలసివస్తుంది. అందులోనూ సినిమా ఫంక్షన్స్‌లో వ్యాఖ్యాతలు మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఆయా కార్యక్రమాలకు పెద్దఎత్తున సెలబ్రిటీలు హాజరవుతారు. కాగా ఇటీవల జరిగిన 'మనలో ఒకడు' అనే సినిమా ఆడియో సక్సెస్‌మీట్లో యాంకరింగ్ చేసిన ఝూన్సీ తన ప్రసంగంలో ప్రముఖ గాయకుడు ఏసుదాస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, అమరగాయకుడు ఏసుదాస్ అని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వేడుకకు హాజరైన అందరూ నిశ్చేష్టులయ్యారు. కొంతమందైతే నవ్వుకున్నారు. కానీ ఝూన్సీ మాత్రం తన ప్రసంగాన్ని సాగిస్తూనే పోయింది. ఏమైనా సరే ఇలాంటి ఫంక్షన్లలో ఇలాంటి తప్పులు దొర్లితే అందరి ముందు అభాసుపాలు కావల్సిందేనని ఝూన్సీ తెలుసుకుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన విషయం.