Advertisementt

పవన్ కి పాచిపోయిన లడ్డూలు..మరి రోజాకి?

Tue 20th Sep 2016 08:55 PM
roja,pawan kalyan,special status,laddu,roja fire on chandrababu naidu  పవన్ కి పాచిపోయిన లడ్డూలు..మరి రోజాకి?
పవన్ కి పాచిపోయిన లడ్డూలు..మరి రోజాకి?
Advertisement
Ads by CJ

జనసేన పార్టీ అధినేత సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని రెండు పాచిపోయిన లడ్డూలతో పోల్చిన విషయం తెలిసిందే. సంచలనానికి దారితీసిన ఈ అంశంపై పలువురు పలు రకాలుగా ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు, ఏపీ భాజపా ఇన్ఛార్జ్ సిద్ధార్ధ నాథ్ సింఘ్ కూడా ఘాటుగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రత్యేక హోదా అంశంపై తాజాగా రోజా కూడాను పవన్ మండిపడినట్లుగానే విరుచుకుపడింది. 

కేంద్రం ఆంధ్రాకు ఇచ్చిన ప్యాకేజీని కుళ్ళిపోయిన క్యాబేజీగా అభివర్ణించింది. అసలు హోదా రావడానికి నెల్లూరు నుండి వెంకయ్య నాయడు, చిత్తూరు నుండి చంద్రబాబు నాయుడు అడ్డంగా మారారని ఆమె తీవ్రంగా మండిపడింది. వారిద్దరే హోదా రానీయకుండా అడ్డుపడుతున్నారని ఆమె వెల్లడించింది. బాబు వస్తే జాబు వస్తుందంటూ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా హోదా సాధిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు అదే హోదాను మంటకలిపి ప్యాకేజీ బాట పట్టారని ఆమె వెల్లడించింది. కాగా దేవుడా ఆ బాబు, వెంకయ్యలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ కాణిపాకం వినాయకుడిని మొక్కతున్నాన్నది రోజా. అయితే అప్పట్లో పవన్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చితే, ఇప్పుడు రోజా కుళ్ళి పోయిన క్యాబేజీతో పోల్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ