Advertisementt

దిల్ రాజు ఎవరికీ అందడంతే..!

Tue 20th Sep 2016 03:52 PM
dil raju,dil raju movies,producer dil raju,dil raju busy with movies  దిల్ రాజు ఎవరికీ అందడంతే..!
దిల్ రాజు ఎవరికీ అందడంతే..!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా నిర్మాణంలో కరెక్టు జడ్జిమెంటుతో ముందుకు పోయే నిర్మాత దిల్ రాజు. ఈయన పట్టిందల్లా బంగారంగా ఈ మధ్య దిల్ రాజు కాలాన్ని చాలా బాలెన్స్ డుగా నడిపిస్తున్నాడు. తెలుగు సినీ నిర్మాతల్లో ఎవరికీ  అందని విధంగా చేతి నిండా సినిమాలతో చాలా అడ్వాన్స్ గా దూసుకుపోతున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా పరమైన జడ్జిమెంటు ఖచ్చితంగా పాటిస్తాడు. అలా అన్ని సక్సెస్ లు సాధిస్తాడు. ప్రస్తుతం ఈయన ఐదు సినిమాలు నిర్మిస్తున్నాడు. వాటిల్లో నేను లోకల్, శతమానం భవతి, దువ్వాడ జగన్నాధం, ఫిదా, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ లో ఓ చిత్రం వంటి చిత్రాలతో దిల్ రాజు బిజీగా  ఉన్నాడు. అన్నీ బారీ బడ్జెట్ చిత్రాలే అన్న విషయం తెలిసిందే. 

ఇంతే కాకుండా దిల్ రాజు సూపర్ హిట్ చిత్రాలకు సంబంధించిన రైట్స్ కొనుక్కొని ప్రాఫటబుల్ బిజినెస్ చేయడంలో దిట్ట. అయితే ఆయన నిర్మాణంలో జరిగే ఈ ఐదు చిత్రాలకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను రూ. 18.5 కోట్ల భారీ మొత్తానికి అమ్మాడని సినీ వర్గాల టాక్. అసలు దిల్ రాజు ప్లానే వేరు. ఆయన అనుకుంటే అది ప్లాన్ ప్రకారం చేసేస్తూ అందులో విజయాలను దక్కించుకోవడం ఆయన నైజం. అందుకనే దిల్ రాజు రూటే సపరేటు అంటారు సినీ విమర్శకులు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ