సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో దృశ్యం చిత్రానికి పోలీసుగా నటించిన కళాభవన్ షాజన్ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో దృశ్యం చిత్రానికి గాను మోహన్ లాల్ తో కలిసి అద్భుత నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అందులో కళాభవన్ షాజన్ నటనను చూసి మంత్రముగ్ధుడైన దర్శకుడు శంకర్.. రజనీ కాంత్ తో తాను దర్శకత్వం వహించే చిత్రంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. కాగా కళాభవన్ షాజన్ ను రోబో 2లో గుణ చిత్ర నటుడిగా నటించే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
అయితే శంకర్ తన ప్రతి చిత్రంలోనూ మలయాళంలో గుర్తింపు ఉన్న ఓ నటుడికి అవకాశం కల్పిస్తున్న విషయం విదితమే. రజనీకాంత్ గతంలో హీరోగా నటించిన ఎందిరన్ (రోబో)లో దివంగత నటుడు కళాభవన్ మణికి అవకాశం కల్పించాడు. అంతకు ముందు తీసిన ముదల్వన్ చిత్రంలో మలయాళ నటుడు కొచ్చిన్ మణికి అవకాశం కల్పించాడు. కాగా ఇప్పుడు రజనీ హీారోగా తాను దర్శకత్వం వహిస్తున్న రోబో 2 చిత్రంలో కూడా మలయాళ నటుడికి అవకాశం కల్పించి ఆనవాయితీని పాటిస్తున్నాడు.