కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా, ఎంపీగా తన మాటకారి తనంతో కేంద్రంలో ఓ వెలుగు వెలిగాడు ఉండవల్లి. ఆతర్వాత జగన్ కాంగ్రెస్ నుండి వైదొలిగినప్పుడు ఉండవల్లి అధిష్టానం మెప్పుకోసం జగన్ ను మాటలతో ఆడుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ మీడియా కూడానూ ఉండవల్లిని ఊసరివెల్లి అంటూ ఎపిసోడ్స్, ఎపిసోడ్స్ నడిపిన విషయం కూడా అందరికీ విదితమే. కానీ అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అది రాజకీయనేతలకే సాధ్యం. అధికారం లేనప్పుడు ఉండవల్లి ఎంతటి మాటలను జారవిడుస్తున్నాడంటే అప్పట్లో 'నేను వైఎస్ కు మంచి సలహాదారుడిగా ఉన్నాను. ఇప్పుడు జగన్ చుట్టూతా కూడా మంచి సలహాలు సంప్రదింపులు జరిపేవారు కనపడటం లేదు. లేకుంటే జగన్ ఏంటి... ఇప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం ఏంటీ'అంటూ వాపోతున్నాడు ఉండవల్లి.
జగన్ యువకుడు. తండ్రి నుండి వచ్చిన వారసత్వ సంపదతో పాటు రాజకీయ బలం ఉంది. కాకపోతే సరైన మార్గదర్శకం, సలహాలు సూచనలు అందించేవాడు లేకనే గత ఎన్నికల్లో జగన్ కొంచంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయాడు. లేకపోతే ఇప్పడు మంచి అధికారాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆంధ్రాని దేదీప్యమానంగా వెలిగింప జేస్తూ ఉండేవాడు అంటున్నాడు ఉండవల్లి. వైకాపా అధినేతగా జగన్ ఏం చేయాలో కూడా సూచనలు ఇచ్చాడు. జగన్ ప్రజల పక్షాన పోరాడుతూ ఉండాలి. సలహాలు సంప్రదింపులను నిరంతరం జరుపుతుండాలి. మేధావుల ఆలోచనలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పట్లో వైఎస్ కు అన్నీ తానై చూసుకొనే వాడిని. ఉత్తమమైన సలహాలు ఇస్తూ ఉండేవాడిని అంటున్నారు ఉండవల్లి. ఒక ప్రతిపక్ష నాయకుడుగా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అసెంబ్లీలో తీవ్రంగా అటాక్ చేయాలని అధికార పక్షం వారిని సౌండ్ లెస్ గా ఉంచాలని ఆయన తెలిపాడు. మొత్తానికి ఉండవల్లి మంచి ఉపాయాన్నే వేశాడు. సలహాలంటూ చిన్నగా జగన్ దరి చేరాలనుకుంటున్నట్లుగా రాజకీయ విశ్లేషకుల బావన.