Advertisementt

ప్యాకేజీని అడ్వాన్సుడ్ వర్షన్ తో పోల్చిన సుజన!

Tue 20th Sep 2016 02:06 PM
sujana chowdary,advanced version,old version,special status,special pyakeji  ప్యాకేజీని అడ్వాన్సుడ్ వర్షన్ తో పోల్చిన సుజన!
ప్యాకేజీని అడ్వాన్సుడ్ వర్షన్ తో పోల్చిన సుజన!
Advertisement

తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా చేసిన కేంద్రం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేంద్రం మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటిస్తుంది. కానీ ఆంధ్రప్రజలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకులు ప్రజల మెప్పు పొందడానికి ఎవరి ధోరణిలో వాళ్ళు నోటి కొచ్చినట్లుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు హోదా కంటే ప్యాకేజీనే బాగుంటుంది, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ త్వరిత గతిన అభివృద్ధి చెందేందుకు ప్యాకేజీ చాలా గొప్పగా ఉపయోగపడుతుందంటూ కితాబు ఇచ్చారు. అలాగే మిగతా కేంద్ర మంత్రులు కూడా ఏపీ ప్రజల మనస్సును హోదాను విడిచిపెట్టి ప్యాకేజీ వైపు మళ్లించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా రోజూ ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని హైలెట్ చేస్తూ అది తమ పార్టీ ఘనతగా అభివర్ణిస్తూ తమకు తామే భుజాలు ఎగురేసుకుంటున్నారు. 

అలాగే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడానూ ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి గల పోలికను చాలా బాగా చెప్పాడు. అంటే హోదా కంటే ప్యాకేజీ చాలా అడ్వాన్స్ డ్ వర్షన్. హోదా అనేది అరిగిపోయిన రికార్డులాంటిది, అప్పట్లో ప్రజలు ఉపయోగించిన  గ్రాం ఫోన్ వంటిది హోదా అయితే నేటి సెల్ ఫోన్ లాంటిది ప్యాకేజీ  అన్నాడు. ఇంకా హోదాతో ప్యాకేజీని పోలుస్తూ అప్పట్లో ఇండియన్ ఎయిర్ లైన్స్  ఉంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా వచ్చిందని, అభివృద్ధి చెందని కాలంలో టెలిగ్రాం ఉంటే ఇప్పుడు టెక్నాలజీ అద్భుతంగా రాణిస్తూ ఇ - మెయిల్స్ సౌకర్యం వచ్చిందని తెలిపాడు.  ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రజలు పట్టుకు వేళాడుతున్న హోదా పాత చింతకాయ పచ్చడి లాంటిదని, హోదా కంటే మెరుగైన త్వరగా అభివృద్ధి చెందేందుకు మార్గంగా ప్యాకేజీ అప్ డేట్ అయిన అడ్వాన్స్ డ్ వర్షన్ అని సుజనా చెప్పుకొచ్చాడు. సుజనా చెప్పిన విషయాలు వినడానికి ఆసక్తికరంగా ఉన్నాయి గానీ, నిజంగా ప్రత్యేక ప్యాకేజీని సద్వినియోగం చేస్తే, కేంద్రం నుండి సరిగ్గా నిధులు రాబట్టుకోగలిగి అభివృద్ధి చేస్తే ఎవరు కాదనరు చెప్పండి.   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement