Advertisementt

నరుడా డోనరుడా నాది హిట్టు కోరిక!

Tue 20th Sep 2016 01:47 PM
naruda donoruda movie,naruda donoruda first look,nagarjuna,naruda donoruda first look posters,sumanth naruda donoruda  నరుడా డోనరుడా నాది హిట్టు కోరిక!
నరుడా డోనరుడా నాది హిట్టు కోరిక!
Advertisement
Ads by CJ

సుమంత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రానికి చెందిన ఫస్ట్ లుక్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశాడు. అప్పట్లో భైరవ ద్వీరం చిత్రంలో నరుడా ఓ నరుడా ఏమి కోరికా అంటూ రంభ పాడుతుంటే బాలకృష్ణ ఆడుతూ  ఉండేవాడు. ఇప్పుడు సుమంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమా పేరు వినగానే ఆ పాట గుర్తుకు రాక మానదు. కానీ ఈ సినిమా పేరే కాస్త డిఫరెంట్ గా నరుడా డోనరుడా అని పెట్టారు. పేరును బట్టే కథా రహస్యం ఏంటో అర్ధమౌతుంది. 

కాగా హిందీలో సూపర్  హిట్ అయిన సినిమా విక్కీ డోనర్. ఈ చిత్రాన్ని సుమంత్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. అయితే సుమంత్ కెరీర్ ప్రారంభంలో కొన్ని హిట్ సినిమాలు  తీసినా ఆ తర్వాత సరైన సినిమాలు పడలేదు. 2014లో చేసిన ఏమో గుర్రం ఎగరా వచ్చు చిత్రం తర్వాత సుమంత్ మాయమయ్యాడు. దాదాపు రెండు సంవత్సరాలు గట్టి హిట్ కోసం ప్రయత్నిస్తూ రీమేక్ ల కాలం నడుస్తుండటంతో రీమేక్ పై ఆయన హిట్ కోసం దృష్టి పెట్టాడు. మల్లిక్ రామ్  అనే కొత్త దర్శకుడితో ఈ చిత్రాన్ని చాన్నాళ్ళ నుండి తీస్తూ ఇప్పుడే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమా పోస్టర్ మీదనే ఐ యామ్ స్పెర్మ్ డోనర్ అని చూపించి మరీ సినిమా అంశాన్ని తేటతెల్లపరిచాడు. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్ర చేసినట్లు తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుండో ఓ మంచి హిట్ కోసం తీవ్రంగా వేచి వేచి చూస్తున్న సుమంత్ కు ఈ సారైనా హిట్ట దక్కుతుందేమో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ