Advertisementt

మళ్లీ మహేష్ కోర్ట్ లోకే మల్టీస్టారర్..!

Tue 20th Sep 2016 12:14 AM
mahesh babu,sanghamitra movie,sunder c director,jayam ravi,bahubali  మళ్లీ మహేష్ కోర్ట్ లోకే మల్టీస్టారర్..!
మళ్లీ మహేష్ కోర్ట్ లోకే మల్టీస్టారర్..!
Advertisement
Ads by CJ

'బ్రహ్మోత్సవం' సినిమా డిజాస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే 3  సినిమాలు హిట్ తో ఒక రేంజ్ లో  క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు... తనకు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మరో సినిమా చేయనున్నాడు మహేష్. ఇక వీటి తర్వాత మహేష్ ఒక మల్టీస్టారర్ చిత్రం లో నటించబోతున్నాడని వార్తలొస్తున్నాయి.

ఈ మల్టీ స్టారర్ చిత్రం 'బాహుబలి' చిత్రానికి మించి ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాని దక్షిణాదిన 'చంద్రకళ, కళావతి' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన సుందర్ సి దర్శకత్వం లో ఉంటుందని సమాచారం. అయితే మహేష్ తో పాటు ఈ చిత్రం లో మరో తమిళ్ హీరో నటించబోతున్నాడట. తమిళ యంగ్ హీరో జయం రవి.. మహేష్ తో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ ఒకవేళ నటించడానికి ఒప్పుకుంటే అతనికి 30 కోట్లు వరకు ముట్ట జెప్పడానికి ఈ చిత్ర నిర్మాతలు రెడీ గా వున్నారని టాక్. 

మరి ఈ చిత్రం గనక మహేష్ ఒప్పుకున్నట్లైతే 30 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న టాలీవుడ్ హీరో గా రికార్డు సృష్టిస్తాడు. అయితే ఈ మల్టీస్టారర్  చిత్రానికి టైటిల్ కూడా ఒకే అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మల్టీ స్టారర్ చిత్రానికి 'సంఘమిత్ర' అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. మరి అన్నీ రెడీ గా వున్నా.. సినిమాపై పూర్తి క్లారిటీ మాత్రం అతి తొందరలోనే వస్తుందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ