Advertisementt

ఇప్పుడైనా అసలైన 'దమ్ము' చూపిస్తారా!

Mon 19th Sep 2016 09:38 PM
jr ntr,dammu,young tiger ntr,boyapati srinu,boyapati with jr ntr movie  ఇప్పుడైనా అసలైన 'దమ్ము' చూపిస్తారా!
ఇప్పుడైనా అసలైన 'దమ్ము' చూపిస్తారా!
Advertisement
Ads by CJ

వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' హిట్ తో ఇంకా హ్యాపీగా వున్నాడు. 'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని ఏ దర్శకుడుతో  చేయనున్నాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ తన స్నేహితుడు రైటర్ వక్కంతం వంశీ తో సినిమా దాదాపు ఖరారైంది అని అనుకున్నారు. కానీ అనూహ్యం గా వంశీతో ఎన్టీఆర్ సినిమా  చెయ్యడం లేదని ప్రచారం జరిగింది. అయితే మళ్ళీ ఎన్టీఆర్ కి 'టెంపర్' వంటి హిట్ ఇచ్చిన పూరితో సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఇక పూరి  - ఎన్టీఆర్ కాంబినేషన్ దాదాపు సెట్ అయ్యిందనుకుంటున్న తరుణం లో ఎన్టీఆర్ తన అన్న  కళ్యాణ్ రామ్ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇజం' విడుదల తర్వాత... పూరి కాంబినేషన్ లో నా సినిమా ఉండొచ్చు అని చెప్పాడు. అంటే తన అన్న సినిమా 'ఇజం' గనక హిట్ అయితే పూరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని లేకుంటే ఉండదని చెప్పకనే చెప్పాడు. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురుంచి  ఇప్పుడు మరో వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతుంది. అదేమిటంటే బోయపాటి తో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చెయ్యబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. మరి ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో 'దమ్ము' సినిమా వచ్చింది. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. మరి ఎన్టీఆర్ కోసం ఒక బలమైన కథ ని బోయపాటి శీను రెడీ చేసాడని... తొందరలోనే ఆ స్టోరీ తో ఎన్టీఆర్ ని కలవబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మరి బోయపాటి స్టోరీ ఎన్టీఆర్ కి గనక నచ్చితే  వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది లేకుంటే మళ్ళీ ఇంకో డైరెక్టర్ పేరు ఎన్టీఆర్ సినిమాకి వినిపించినా.. వినిపించవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ