వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) సమన్లు ఇచ్చింది. ఇంకా కేసులో నిందితులైన దివంగత నేత వైయస్ అనుయాయుడు, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాంకీ ఫార్మా అధినేత అయోధ్య రామిరెడ్డిలకు కూడా ఈడీ సమన్లు పంపింది. జగన్ ఆస్తులు, రాంకీ సంస్థ అక్రమార్జనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. రాంకీ పెట్టుబడులు, మనీ లాండరింగ్ కి సంబంధించి సదరు అక్రమార్కులు సమాధానం చెప్పాలంటూ ఈడీ సమన్లు పంపింది.
జగన్‌కి సంబంధించిన అక్రమాస్తుల కేసు ఇప్పటికే నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్లో పెట్టిన విషయం తెలిసిందే.