Advertisementt

రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్..!

Mon 19th Sep 2016 04:14 PM
smriti irani,rahul gandhi,amethi,fire,elections,pipri village  రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్..!
రాహుల్ పై స్మృతి ఇరాని ఫైర్..!
Advertisement
Ads by CJ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజుగా పిలవబడే రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, సినీ నటి స్మృతి ఇరానీ ఫైర్ అయింది. స్మృతి ఇరాని అమేథిలో పర్యటించిన సందర్భంగా రాహుల్ పై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ పబ్లిసిటీ పెంచుకునే నిమిత్తం పూరిగుడిసెల్లోకి వెళ్ళి పేదవారికి భారంగా మారుతున్నాడే తప్ప పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని వివరించింది.  అమేథీ నుంచి లోక్ సభకు ఎన్నికైన రాహుల్ గాంధీపై స్మృతి తీవ్రంగా విరుచుకు పడింది. ప్రజల్లోకి వెళ్ళి సామూహికంగా ప్రజల సమస్యలను అర్ధం చేసుకొని వాటిని పరిష్కరించేందుకు మార్గాన్ని అన్వేషించాలి గాని పేదవారిపై భారం వహించేలా ప్రవర్తించడం మానుకోవాలని విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అమేథిలో ప్రజలు సమస్యలు తనకు చెప్తే తాను ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానని, రాహుల్ ప్రజాసేవలో పూర్తిగా విఫలం కావడంతో తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగవలసి వచ్చిందని స్మృతి ఇరాని చెప్పింది. కాగా అమేథీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూడబోతే, ఇంతకు ముందుకూడాను స్మృతి అమేథీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో... రాజకీయంగా స్మృతి అమేథీ ప్రజల మనస్సులను తనవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుందనే చెప్పాలి.  

అయితే స్మృతి ఇరాని గోమతి నది వరదతో నష్టపోయిన అమేథీ పరిదిలోని పిప్రి గ్రామంలో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గట్టు నిర్మాణ ప్రాజెక్టును స్మృతి ఇరానీ ప్రారంభించింది.  కాగా 2014 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికలను ఆ గ్రామస్తులు ఓటు వేయకుండా బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరద నివారణకు గట్టు నిర్మించే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చింది. అయితే పనిలో పనిగా స్మృతి జగదీశ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలో ఒక ఆరోగ్య శిబిరాన్ని కూడా స్మృతి ప్రారంభించింది. ఇంతగా స్మృతి అమేథీపై దృష్టి పెడుతుందంటే అనాది నుంటి అమేథీలో తిరుగులేని కాంగ్రెస్ పార్టీ వేర్లను రాబోవు ఎన్నికల్లో  భాజపా పెరికి వేయడం ఖాయం అన్నట్లు తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ