Advertisementt

నాని ప్లానింగ్‌కు తిరుగులేదు..!

Mon 19th Sep 2016 04:10 PM
nani,selected movies,planing,direction deportment,yearly 2 or 3 movies  నాని ప్లానింగ్‌కు తిరుగులేదు..!
నాని ప్లానింగ్‌కు తిరుగులేదు..!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ఇప్పటికే నాని నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో పాటు 'జెంటిల్‌మెన్‌' కూడా రిలీజై విజయం సాధించింది. ఇక నాని తదుపరి చిత్రం 'మజ్ను' ఈనెలలోనే విడుదల కానుంది.ఇక తన మొదటి చిత్రం 'సినిమా చూపిస్తమావా' ఫేమ్‌ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నాని నటిస్తూ, దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతున్న'నేను.. లోకల్‌' చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లోనే క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. కాగా నాని ఆ తర్వాతి చిత్రాన్ని అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇకపై కూడా తన నుంచి ఏడాదికి రెండూ, మూడు సినిమాలు రిలీజ్‌ అయ్యేలా నాని ప్లానింగ్‌ చేసుకుంటున్నాడు. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చిన వాడు కావడంతో ఆయన ప్రణాళికా బద్దంగా చిత్రాలు చేస్తూ విజయాలతో దూసుకెళ్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ