Advertisementt

కార్తీ కోసం అన్న త్యాగం....!

Mon 19th Sep 2016 01:57 PM
tamil,karthi,suriya,singam 3 movie,kashmora movie,brother sacrifices  కార్తీ కోసం అన్న త్యాగం....!
కార్తీ కోసం అన్న త్యాగం....!
Advertisement
Ads by CJ

అన్నాతమ్ముళ్లయిన సూర్య, కార్తీలకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. గత కొంతకాలంగా సూర్యకి ఏ సినిమా కూడా కలిసిరావడం లేదు. '24' చిత్రం తెలుగులో మంచి హిట్టయినా తమిళంలో మాత్రం కేవలం యావరేజ్‌గా నిలిచింది. దీంతో తనకు ఎప్పుడు కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నా సూర్యకి దర్శకుడు హరి చేసే సినిమా కీలకంగా మారుతోంది. ఈసారి 'సింగం 3 'ను మొదట దీపావళికి విడుదల చేయాలని సూర్య హరి భావించారు. కాగా దీపావళికి కార్తి హీరోగా భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు 70కోట్లతో రూపొందుతున్న 'కాష్మోరా' చిత్రం విడుదల కానుంది. దీంతో తన తమ్ముడు కార్తికి తానే పోటీకాకూడదని భావించిన సూర్య తన 'సింగం 3 'ను డిసెంబర్‌కు డేట్‌ మార్చుకున్నాడు. వాస్తవానికి తన సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాత ఎవరు పోటీకి దిగినా సూర్య పట్టించుకోడు. కానీ ఈ సారి మాత్రం తమ్ముడి సినిమాకు పోటీ కాకూడదని భావించి తన సింగం సిరీస్‌ను వాయిదా వేసుకున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ