Advertisementt

హిట్లు వచ్చినా తాప్సికి క్రేజ్‌ రావడం లేదు...!

Mon 19th Sep 2016 01:51 PM
taapsee pannu,amitabh bachchan,pink movie hit,crage,hit movies in bollywood  హిట్లు వచ్చినా తాప్సికి క్రేజ్‌ రావడం లేదు...!
హిట్లు వచ్చినా తాప్సికి క్రేజ్‌ రావడం లేదు...!
Advertisement
Ads by CJ

నాలుగేళ్లు టాలీవుడ్‌లో ఎన్ని ప్రయత్నాలు చేసినా టాలీవుడ్‌ ప్రేక్షకలు తాప్సిని పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌లో ఈ భామకు ఒక్కటంటే ఒక్క హిట్‌ కూడా లేదు. ఆ సమయంలో ఆమెకు అనుకోకుండా బాలీవుడ్‌ చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. తాను నటించిన 'జస్దూ బద్దూర్‌, బేబి' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా తాప్సి, అమితాబచ్చన్ కీలకపాత్రలో నటించిన 'పింక్‌' చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఎంతో సీనియర్‌ అయిన అమితాబచ్చన్ కి ధీటుగా నటించిందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఇలా తాప్సి తన బాలీవుడ్‌ కెరీర్‌లో వరసగా హాట్రిక్‌ హిట్స్‌ను అందుకుంటోంది. కానీ తాప్సికి మాత్రం ఇప్పటికీ మంచి మంచి చిత్రాలైతే వస్తున్నాయి కానీ ఆమెకు క్రేజ్‌నైతే తెచ్చి పెట్టలేకపోతున్నాయి. త్వరలో సౌత్‌ నుండి హిందీలోకి రీమేక్‌ అవుతున్న పలు చిత్రాలలో తాప్సికి ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ తాప్సికి స్టార్‌హీరోయిన్‌ హోదా మాత్రం రాకపోతుండటంతో ఆమె నిరాశ పడుతోంది. మరి తాప్సికి బాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చే సినిమా రాకపోతుందా? అనే ఆశలో ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ