Advertisementt

అందరికీ ఈ దసరా చాలా కీలకం....!

Mon 19th Sep 2016 10:48 AM
ram,nenu sailaja,hyper movie,allari naresh,naga chaitanya,premam movie,tamanna,abhinetri movie,dasara festival,releases  అందరికీ ఈ దసరా చాలా కీలకం....!
అందరికీ ఈ దసరా చాలా కీలకం....!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది దసరాకు పెద్ద చిత్రాలేమీ రావడంలేదని స్పష్టమైంది. ఈ దసరా మాత్రం కొందరికి అగ్నిపరీక్షగా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్‌లేని హీరో రామ్‌ 'నేను.. శైలజ'తో పర్వాలేదనిపించాడు. ఇప్పుడు ఆయన దృష్టింతా 'హైపర్‌' మీదనే ఉంది. ఇక అల్లరినరేష్‌ విషయానికి వస్తే ఈ దసరా ఆయనకు చావోరేవో తేల్చనుంది. గత నాలుగేళ్లుగా కనీసం యావరేజ్‌ చిత్రం కూడా చేయలేకపోతున్న అల్లరినరేష్‌... తాజాగా నటిస్తున్న 'ఇంట్లో దెయ్యం... లేదు భయం' చిత్రం గతంలో నరేష్‌కు మంచి హిట్లిచ్చిన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో అగ్ర నిర్మాత బి.వి.ఎస్‌,ఎస్‌. ప్రసాద్‌ నిర్మిస్తుండటం విశేషం. ఇక అక్కినేని హీరో నాగచైతన్యకు సైతం 'ప్రేమమ్‌' విజయం కీలకంగా మారింది. ఇక తమన్నా కెరీర్‌కు కూడా 'అభినేత్రి' విజయం తప్పనిసరి. ఆమె 'బాహుబలి 1'లో నటించినా ఆ క్రెడిట్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఖాతాలో పడింది. 'ఊపిరి' చిత్రం విషయానికి వస్తే ఈ చిత్ర విజయం నాగార్జున, కార్తీ ఖాతాలో పడింది. మరి తాను నటిస్తోన్న 'అభినేత్రి'తో ఆమె అందరినీ ఆకట్టుకోవాలని చూస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అదే రోజున విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఆ క్రెడిట్‌ ఏ ప్రభుదేవా ఖాతాలోనో లేక దర్శకుడు విజయ్‌ వంటి వారి ఖాతాలోకి వెళ్తుందా? లేక తమన్నా క్రెడిట్‌లో పడుతుందా? అనేది చర్చనీయాంశం అయింది. కాగా ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ మూవీ కాబట్టి ఈ చిత్రం హిట్టయితే తన దశమారుతుందనే నమ్మకంతో ఉంది తమన్నా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ