Advertisementt

అందరి దృష్టీ ఆ మలయాళ చిత్రం మీదనే....!

Sun 18th Sep 2016 08:17 PM
malayalam movies,hit movies,oppam movie remake,telugu,tamil,kamal hassan  అందరి దృష్టీ ఆ మలయాళ చిత్రం మీదనే....!
అందరి దృష్టీ ఆ మలయాళ చిత్రం మీదనే....!
Advertisement
Ads by CJ

'దృశ్యం, ప్రేమమ్‌' వంటి మలయాళ సంచలన విజయాలను సాధించిన చిత్రాలు అందరినీ ఆకర్షించాయి.  తాజాగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన 'ఒప్పం' చిత్రం కేరళలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటోంది. 'దృశ్యం'లాగానే ఈ చిత్రం కూడా ఓ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇందులో మోహన్‌లాల్‌ అంధునిగా అద్బుతంగా నటించాడు. కేవలం 10కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఒక్క మలయాళంలోనే మొదటివారంలో 14కోట్లు వసూలు చేసింది. ఇక 10ఏళ్ల పాపతో మోహన్‌లాల్‌ చేసిన సన్నివేశాలు మనస్సులను హత్తుకుంటున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ దర్శకుడు. అయితే ఈ చిత్రం రీమేక్‌పై ఇప్పటికే అన్ని భాషల వారు కన్నేశారు. కమల్‌హాసన్‌ ఈ చిత్రం తానే చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర తమిళ, తెలుగు రైట్స్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఇక హిందీలో  ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రీమేక్‌లో నటించాలని ప్రియదర్శన్‌కు ఆప్తుడైన అక్షయ్‌కుమార్‌ రెడీ అయిపోతున్నాడు. మరి ఈ చిత్రాన్ని మన దర్శకులు, హీరోలుగా ఎవరైతే బాగుంటారనే చర్చ కొనసాగుతుంది. మరి తెలుగులో ఈ చిత్రాన్ని ఎవరు చేయనున్నారు? కమల్‌హాసనే తెలుగులో కూడా చేయనున్నాడా? అనేది వేచిచూడాల్సిన విషయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ