సాధారణంగా తెరవెనుక ఉంటే డైరెక్టర్లు, ఇతర యూనిట్ కంటే చిత్రాలలో నటించే నటీనటులకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. అందుకే తమిళంతో పాటు తెలుగులో కూడా పలువురు ఆర్టిస్ట్‌లుగా మారారు. కానీ కోలీవుడ్ దర్శకులు మాత్రం విలన్ వేషాలపై ఆశలు పెంచుకుంటున్నారు. గతంలో మణివణ్ణన్ నుండి ఎస్ జె సూర్య, మహేంద్రన్, గౌతమ్‌మీనన్‌లు మాత్రం విలన్ వేషాలకు ఫ్లాటై పోతున్నారు. ఎంతగా అంటే ఎస్.జె.సూర్య పూర్తిగా దర్శకత్వం మానేసి విలన్ పాత్రలకే పరిమితమయ్యేంతగా... వీరిని విలన్ వేషాలు టెమ్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబు - మురుగదాస్‌ల కాంబినేషన్‌లో కూడా పూర్తిస్దాయి విలన్‌గా ఎస్ జె సూర్య నటిస్తున్నాడు. వేషాల కోసం ఆయన పవన్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఆ అవకాశాన్ని తృణప్రాయంగా భావించి నటునిగా సెటిల్ అయ్యాడు. కాగా త్వరలో గౌతమ్‌మీనన్ కూడా జ్ఞానరాజా దర్శకత్వంలో నయనతార నటిస్తున్న చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక మహేంద్రన్ అయితే 'తేరి' చిత్రంలో ఓ పవర్‌ఫుల్ విలన్‌గా చేసి ప్రేక్షకుల, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. మరి ఈ కోవలో మరెంత మంది దర్శకులు విలన్‌లుగా మారుతారో? ఎంతమంది నటీనటులు దర్శకత్వంపై మోజు పెంచుకొని, దర్శకులుగా మారుతారో వేచిచూడాల్సివుంది...!