కాపు నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందంటున్నాడు. తనపైన, తన కుటుంబసభ్యుల మీద టిడిపి ప్రభుత్వం కక్ష్యసాధింపు దోరణితో సాగుతోందని, తనకు మద్దతిచ్చిన వారిపై కూడా వ్యక్తిగత కక్ష్య పెంచుకొని పోలీసులు తమను వేదిస్తురని ఆయన ఆరోపిస్తున్నారు. తాను చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణ లాగా గన్‌ను వాడలేడనని, బాలయ్య తన భార్య గన్‌ను కూడా తన అవసరానికి వాడుకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటికే తన వద్ద ఉన్న గన్‌ను, చివరకు తనకు సభ పెట్టుకోవడానికి స్దలం ఇచ్చిన తన వియ్యంకుడి గన్‌ను కూడా పోలీసులు తీసేసుకున్నారని, ప్రభుత్వం తనపై ఈ విధంగా ప్రవర్తిస్తే తన ప్రాణాలకు ముప్పుగా ఉందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. మరి దీనిపై మరీ ముఖ్యంగా బాలయ్య గన్ వాడకం గురించి ముద్రగడ ఎప్పటి విషయాన్నో ఇప్పుడు తెరపైకి తేవడం చూస్తుంటే ఇది ఓ పెద్ద వివాదానికి ప్రాణం పోసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.