Advertisementt

'గురు' లుక్ లోనూ బాలీవుడ్ స్టయిలే!

Sun 18th Sep 2016 02:21 PM
guru,venkatesh,venkatesh guru movie look,bollywood style  'గురు' లుక్ లోనూ బాలీవుడ్ స్టయిలే!
'గురు' లుక్ లోనూ బాలీవుడ్ స్టయిలే!
Advertisement
Ads by CJ

వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా పేరు 'గురు' అని ఎప్పుడో ఎనౌన్స్ చేసేసాడు. ఇక ఇప్పుడు లుక్ కూడా బయటికి వచ్చేసింది. వెంకటేష్ ఈ మధ్య రీమేక్ లనే ఎక్కువగా నమ్ముకుని తెగ హిట్స్ కొట్టేస్తున్నాడు. తాజాగా తెలుగు లో 'బాబు బంగారం' సినిమా ఆశించిన విజయం అందించకపోయినా కూడా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించేస్తున్నాడు వెంకీ. హిందీ - తమిళ్ లో హిట్ అయినా 'సాలా ఖద్దూస్' ని... తెలుగులో 'గురు' పేరు తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా మొదలవ్వలేదు కానీ ఫస్ట్ లుక్ ని మాత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ లోనే సినిమా ఓపెనింగ్ డేట్ ఇంకా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసేసారు. ఇలా ఒక్క బాలీవుడ్ లోనే జరుగుతుంది. సినిమా ఓపెనింగ్ రోజునే ఆ సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేసేస్తారు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు తెలుగు లో కూడా కొన్ని సినిమా లకు మొదలైనప్పుడే రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు కానీ కొన్ని అవాంతరాల వల్ల అనుకున్న డేట్ కి సినిమాలను రిలీజ్ చెయ్యలేక నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి 'గురు' సినిమాకి కూడా ముహూర్తం డేట్ అండ్ రిలీజ్ డేట్ ను కూడా ఇచ్చేసి కొంచెం ఆశ్చర్యానికి గురి చేశారు ఈ చిత్ర యూనిట్ వాళ్ళు. ఈ సినిమా ఓపెనింగ్ సెప్టెంబర్ 3 వ వారంలోనూ... రిలీజ్ డేట్ డిసెంబర్ 19 న అని చెబుతున్నారు. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలో సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తారన్నమాట. మరి గురు ఫస్ట్ లుక్ లో వెంకటేష్ కొంచెం నెరిసిన గడ్డం తో కొత్తగా ట్రై చేస్తున్నాడు. మరి ఈ లుక్ అందరిని ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నారు యూనిట్ వాళ్ళు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ