పవన్ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ తిరుపతి, కాకినాడ సభల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు అవసరం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ఆర్దికప్యాకేజ్‌ను ఇప్పుడు చంద్రబాబు ఎంతో అర్ధం చేసుకొని, ప్రత్యేకహోదా రాకపోయినా ఫర్వాలేదు... ప్యాకేజీ చాలన్నట్లుగా టిడిపి నేతలు ప్రకటనలిస్తున్నారు. ఈ విషయంపై బాబుపై కూడా పవన్ విమర్శలు చేస్తారో? లేదోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. బిజెపి నేత సోమువీర్రాజు మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ దృష్ట్యా ఆ విషయాన్ని బాబు బాగా అర్ధం చేసుకున్నాడని, దీనిపై పవన్ కూడా సానుకూలత వ్యక్తం చేయడం ఖాయమంటున్నాడు. త్వరలో ప్రజల్లోకి వెళ్లి ప్యాకేజీతో సహా అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తామని, అందులో భాగంగానే కేంద్రమంత్రి పీయూష్‌ఘోయల్ ఈ నెల 22న రాజమండ్రిలో పర్యటిస్తారని ప్రకటించారు. ఈ తరుణంలో పవన్ సర్దుకుపోయే ప్రసక్తిలేదని, ఇక ఆయన త్వరలో టిడిపిని కూడా ఎండకట్టడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.