Advertisementt

ఫుల్ జోష్ లో.. వరుణ్ తేజ్..!

Sat 17th Sep 2016 08:24 PM
varun tej,full josh,vijay kumar konda,varun tej busy with movies  ఫుల్ జోష్ లో.. వరుణ్ తేజ్..!
ఫుల్ జోష్ లో.. వరుణ్ తేజ్..!
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. కథకులంతా ఆయన కోసమే అన్నట్టుగా కథలు రాస్తూ తమ మేధకు పదునుపెడుతున్నారు. మెగా హీరోలలో ఎవ్వరికీ రానన్ని అవకాశాలు వరుణ్ తేజ్ కు వస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వరుణ్ తేజ్ అద్భుతంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల, శేఖర్ కమ్ముల సినిమాలు చేస్తుండగా అదే వరుసలో చందు మెండేటి సినిమాకు కూడా హీరోగా త్వరలో చేయనున్నాడు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు సంస్థలో మరో కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో కూడా వరుణ్ తేజ్ నటించనున్నట్లు తెలుస్తుంది. కాగా వీటన్నింటి మధ్యలో మరో సినిమాను  కూడా చేస్తానని ఒప్పేసుకున్నాడు వరుణ్ తేజ్. కన్ ఫ్యూజన్ కామెడీతో విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే చాలా త్వరగానే ఈ సినిమా సెట్స్ పైకి రానుందని, అందుకు తగిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా విజయ్ కుమార్  కొండా ఒక లైలా కోసం, గుండె జారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ