సమంత పెళ్ళిచేసుకుని ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందని అందరూ అనుకున్నారు. అందరు అనుకున్నట్లుగానే సమంత ఈ మధ్య ఏం సినిమాలు ఒప్పుకోకుండా ఖాళీగా ఉంటోంది. మరి అందరూ అనుకున్నట్లు పెళ్లి వలన ఆమె సినిమాలకు దూరమవడం లేదట. దానికి ఒక బలమైన కారణం ఉందట. అదేమిటంటే సమంత కి మంచి రోల్స్ రాకపోవడం వల్లనే తాను ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదని... సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అర్ధవంతమైన పాత్రలు దొరకడం లేదని అవి దొరకడం ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుందని అంటుంది. మంచి కేరెక్టర్స్ రాకపోవడం వల్లనే నేను ఏ సినిమాకి సైన్ చెయ్యలేదని చెప్తుంది. కేవలం ఇదే కారణం అని అంటోంది. దీంతో ఈ మధ్య బాగా గ్లామర్ డోస్ పెంచేసి హాట్ హాట్ గా కనిపించిన సమంతేనా ఈ మాటలు చెప్తుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య అవసరానికి మించి స్కిన్ షో చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తున్న సమంత ఇప్పుడు అర్ధవంతమైన పాత్రలు అంటూ కబుర్లు మొదలెట్టిందేమిటి సడెన్ గా అని అంతా అనుకుంటున్నారు. కానీ నాగ చైతన్యని పెళ్లి చేసుకుని ఇక మీదట గ్లామర్ గా హాట్ గా కనిపించకుండా పద్దతిగా వుండే రోల్స్ లో చెయ్యాలని సమంత అనుకుంటుందేమో. అందుకే ఇలా ఇప్పుడు అర్ధవంతమైన పాత్రలు అంటూ తెగ మాట్లాడేస్తోంది.