Advertisementt

ఆ జంట విడాకులు నిజమేనంట..!

Sat 17th Sep 2016 07:35 PM
soundarya rajinikanth,divorce,ashwin,soundarya divorced ashwin  ఆ జంట విడాకులు నిజమేనంట..!
ఆ జంట విడాకులు నిజమేనంట..!
Advertisement
Ads by CJ

మనస్ఫర్ధల కారణంగా చిత్రపరిశ్రమకు చెందిన మరో జంట విడాకులు తీసుకోబోతుంది. అందుకు సిద్ధమౌతుంది  ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె కావడంతో ఈ వార్త ప్రధాన్యం సంతరించుకుంది. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  రజనీకాంత్ రెండో కుమార్తె అయిన సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు సౌందర్యనే స్వయంగా ప్రకటించింది.

సోషల్ మీడియాలో వస్తున్న విడాకులకు సంబంధించిన వార్తలపై సౌందర్య స్పందిస్తూ... తమ విడాకులపై వస్తున్న వార్తలు నిజమేనని తెలిపింది. ఇంకా సంవత్సరం నుండి తాను, అశ్విన్ విడివిడిగానే ఉంటున్నామని వెల్లడించింది. కాగా తమ విడాకుల విషయంలోనే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వివరించింది. కానీ ఇది  తమ కుటుంబానికి సంబంధించిన విషయం అనీ, దీనిపై మితిమీరిన ఊహాగానాలు అనవసరం అని తెలిపింది.  ఇంకా ఆమె మాట్లాడుతూ తమ స్వేచ్ఛను గౌరవించి, ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన విషయాన్ని, వ్యక్తులను రచ్చ చేయాల్సిన పని లేదని సౌందర్య తెలిపింది. ఈ విషయాలను ప్రస్తావిస్తూ సౌందర్య ట్విట్ చేసింది. తమ కుటుంబానికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న సోదరి భర్త ధనుష్ కు  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఇప్పుడు విడాకులు  తీసుకోవాలనుకుంటున్న సౌందర్య రజనీకాంత్‌ వివాహం 2010లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో జరిగింది. ఆ జంటకు ఓ బిడ్డ కూడా పుట్టాడు.

కాగా సౌందర్య గ్రాఫిక్స్ లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. గోవా చిత్రం ద్వారా సౌందర్య నిర్మాతగా వ్యవహరించింది. ఇంకా రజనీ కాంత్ హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ లో దర్శకురాలుగా కూడా పరిచయం అయ్యింది సౌందర్య. ఇప్పుడు ధనుష్ హీరోగా సౌందర్య ఒక చిత్రం గురించి ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ