Advertisement

ప్రధాని మోడికి శుభాకాంక్షల వెల్లువ!

Sat 17th Sep 2016 06:51 PM
narendra modi,birthday,birthday wishes to modi,prime minister  ప్రధాని మోడికి శుభాకాంక్షల వెల్లువ!
ప్రధాని మోడికి శుభాకాంక్షల వెల్లువ!
Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి 66వ పడిలోకి అడుగుపెట్టారు. మోడి పుట్టిన రోజు సందర్భంగా దేశమంతా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మోడి అభిమానులు, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.  మోడి పుట్టిన రోజును సేవా దివస్ గా ముందుగానే భాజపా జాతీయ అధ్యక్షుడు అమితషా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  అందులో భాగంగా అమిత్ షా తెలంగాణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటుండగా.. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు శనివారం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించాడు.

మోడీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియమైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రముఖులు మొదులుకొని సామాన్యుల వరకు మోడికి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కాగా గుజరాత్‌లో ఉన్న ప్రధాని మోడీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్ ఠాకూర్‌ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రధాని మోడీని కలిసేందుకు వచ్చిన చీఫ్‌ జస్టిస్‌ను మోడీనే స్వయంగా గుమ్మంలోకి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. 

ఇంకా నరేంద్ర మోదీ యాప్‌ద్వారా ప్రజలంతా నేరుగా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మోడీ పుట్టిన రోజు వేడుకలు కూడా పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. గుజరాత్ లోని నవసారి జిల్లాలో దివ్యాంగులకు ఒక్కసారిగా 17,000 కిట్లు అందజేయనున్నారు. అంతేకాకుండా గిన్నిస్‌ రికార్డులకెక్కాలని కూడా ప్రయత్నిస్తున్నారు. వీల్‌చైర్లలో కూర్చున్న వెయ్యిమందితో ఓ చిత్రరూపాన్ని ఏర్పాటుచేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వెయ్యిమంది బధిరులకు చెవిటి మిషన్లను అందజేసి మరో రికార్డు కూడా సొంత చేసుకోనున్నారు.

ఇంకా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తో సహా పలువురు భాజపా నాయకులు, మంత్రులు ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.  యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని టిమ్ కుక్ పేర్కొనడం విశేషం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement