Advertisementt

ఆ హీరో స్విమ్మింగ్ పూల్ వల్లే విద్యాబాలన్ కి డెంగ్యూ !

Sat 17th Sep 2016 06:36 PM
vidya balan,dengue fever,shahid kapoor,swimming pool,vidya balan suffering with dengue  ఆ హీరో స్విమ్మింగ్ పూల్ వల్లే విద్యాబాలన్ కి డెంగ్యూ !
ఆ హీరో స్విమ్మింగ్ పూల్ వల్లే విద్యాబాలన్ కి డెంగ్యూ !
Advertisement
Ads by CJ

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకింది. ముంబైలోని జుహుతారా రోడ్డులో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న విద్యాబాలన్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్య పరిక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం విద్యాబాలన్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటుంది. డెంగ్యూ వ్యాధికి గురిచేసే దోమల(ఎడెస్ ఏఈజిప్టీ జాతి)ను అరికట్టడంలో తగు మార్గదర్శకాలను పాటించకపోవడం కారణంగానే విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యాబాలన్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంటులో ఉన్నవారికి సైతం పలుగురికి డెంగ్యూ సోకినట్లు తెలుస్తుంది. దాంతో వైద్యులు అప్రమత్తమై అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. విద్యాబాలన్ కు డెంగ్యూ సోకిందని తెలియగానే అందుకు కారణాలను వెలికితీస్తూ పలువురిపై బీఎంసీ కొరడా ఝుళిపించింది.

ఈ విషయం తెలియగానే ముంబై బీఎంసీ రంగంలోకి దిగింది. డెంగ్యూకు గల కారణాలపై విచారించింది. అదే అపార్ట్ మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసముంటున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, అందులోనే మూడో ఫ్లోర్ లో నివాసముంటున్న ఇళ్లను కూడా బీఎంసీ పరిశీలించింది. డెంగ్యూకు కారణాలను జాగ్రత్తగా పరీక్షించిన బీఎంసీ  షాహిద్ కపూర్ కు చెందిన స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీటిని వినియోగించకపోవడంతో నిల్వ ఉన్న నీటిలో డెంగ్యూని వ్యాప్తి చేసే దోమలు ప్రవేశించాయని, వాటి కారణంగానే డెంగ్యూ విస్తరిస్తుందని బీఎంసీ గుర్తించింది. ఈ విషయంపై బీఎంసీ 382 సెక్షన్  ప్రకారం నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా షాహిద్ కపూర్ కు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే అంటే సెప్టెంబర్ నెలలోనే ముంబైలో దాదాపు 1,500 మంది వరకు డెంగ్యూ అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తుంది.