నయీమ్ కేసు కీలక మలుపు తిరగబోతోందని గత రెండు మూడు రోజుల నుండి మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర చాలా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని నయీమ్ కేసులో దోషులను వినాయక నిమజ్జనాల తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం ప్రశాంతం గా పూర్తయ్యింది. ఇక ఈ కేసు గురించి మీడియా లో వార్తలు ఊపందుకున్నవేళ ఆ కేసు తో సంబంధం వున్న ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు.
టిటిడిపి గత ఎన్నికల్లో ఒక దళితుడిని ముఖ్యమంత్రి ని చెయ్యాలని నిర్ణయించి సీఎం అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యని బరిలోకి దింపింది. కానీ తెలంగాణ లో టిటిడిపి ఘోర పరాజయం పాలైంది. ఇక ఓటమి తర్వాత టీడీపీలోని గెలిచినా, గెలవని నేతలు అందరూ అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. మిగిలిన వారు టి.ఆర్.ఎస్ లోకి వెళ్లాలా లేక టిడిడిపిలోనే కొనసాగాలా అని కొట్టు మిట్టాడుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఆర్ కృష్ణయ్య టిటిడిపికి దూరంగా వుంటూ వస్తున్నాడు. కృష్ణయ్య కూడా ఆమధ్య టి.ఆర్.ఎస్ లోకి వెళుతున్నాడనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.
ఇక ఇప్పుడు నయీమ్ కేసులో ఆర్. క్రిష్ణయ్య ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన క్రిష్ణయ్య నాకు నయీమ్ తో పరిచయమైతే వుంది కానీ నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని చెబుతున్నాడు. అంతేకాదు నాకు ఎలాంటి లింకులు నయీమ్ తో లేవని... ఉన్నాయని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని క్రిష్ణయ్య చెబుతున్నాడు. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే అధికార పార్టీ తనపై ఇలాంటి బురద చల్లుతుందని చెప్పుకొచ్చాడు. నేను కేవలం టి.ఆర్.ఎస్ లోకి వెళ్ళకపోవడం వల్లనే నన్ను ఇలా ఇరికించడానికి చూస్తున్నారని అంటున్నాడు. అసలు నయీమ్ తో అధికార పార్టీ కి చెందినవారికి చాలామందికి లింకులున్నాయని... నయీమ్ డైరీని గనక బయటపెడితే అధికార పార్టీ వాళ్ళు కూడా ఇరుక్కుంటారని అంటున్నాడు. అసలు నయీమ్ కేసును సుప్రీం కోర్టు లో విచారణ జరిపిస్తే అన్ని నిజాలు బయటికొస్తాయని డిమాండ్ చేస్తున్నాడు. మరి కృష్ణయ్యకి సంబంధం లేకుండానే ఇలాంటి వార్తలు బయటికొస్తున్నాయా అనేది ఇప్పుడు అందరి ముందు నిలిచిన ప్రశ్న. అతనేం తప్పు చెయ్యక పొతే నయీమ్ తో తనకెలాంటి సంబంధాలు ఉన్నాయో బయటపెట్టాలని అధికార టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేసున్నారు.
నయీమ్ అయితే చచ్చిపోయాడుగాని.... అతని వల్ల బడా వ్యక్తులు చేసిన మోసాలు అన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇంకా నయీమ్ కేసులో ఎంత ముఖ్యమైన పేర్లు బయటికి వస్తాయో అని ప్రజలు తెగ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.