Advertisementt

భాజపా అస్త్రం కావూరి నా..!

Sat 17th Sep 2016 04:44 PM
bjp,kavuri sambasivarao,congress,bjp government  భాజపా అస్త్రం కావూరి నా..!
భాజపా అస్త్రం కావూరి నా..!
Advertisement
Ads by CJ

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు ఈ మధ్య పదే పదే కాంగ్రెస్ పై అటాక్ చేస్తున్నాడు. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా, ఆంధ్రాలో సీనియర్ నాయకుడుగా ఉన్న కావూరితో భాజపా కొత్త ప్రయోగం మొదలెట్టిందనే చెప్పాలి.  విభజన కారణంతో కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి భాజపాలో చేరిన కావూరిని ఎంచక్కా భాజపా ఉపయోగించుకొంటుంది. అదే అదునుగా భావించి కావూరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. కాగా ఈయన వెనుక ఉండి నడిపిస్తుంది భాజపానా? లేక కేంద్రంలో అధిష్టాన పెద్దలా? అనే విషయం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కావూరి సాంబశివరావు భాజపాలో చేరిన కొత్త‌లో తన బాణం తేదేపాపైనే గురిచూసేది.  అప్పట్లో చంద్రబాబును తెగ విమర్శించేవాడు. కానీ ఈ మధ్య కావూరి రూటు మార్చారు. తన స్వరాన్ని కాంగ్రెస్ వైపు మళ్ళించాడు. భాజపానుండి వచ్చిన సంకేతాలతో తన ప్ర‌ధాన టార్గెట్ కాంగ్రెస్ నే లక్ష్యంగా చేసుకొని పోరాటం జరుపుతున్నారు. కావూరి మాట్లాడుతూ... తెలుగు ప్రజలను విభ‌జించిన ఆ పాపం కాంగ్రెస్‌దేనని.... ప్రస్తుతం ఏపీలో జ‌రుగుతున్న అన‌ర్థాల‌కు కార‌ణం కాంగ్రెస్సే అంటూ ముమ్మరంగా కామెంట్లు చేసేస్తున్నాడు. కావూరిని టూల్ గా ఉపయోగించుకొని కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టాలని భాజపా అధిష్టానం ఎత్తుగడ వేసినట్లు అర్ధమౌతుంది. అందులో భాగంగానే కావూరికి భాజ‌పా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది.  భాజపా జరిపే ప్రతి విషయంపైనా ఆయన స్వరం ఉండటం వెనుక కేంద్ర భాజ‌పా అధినేతల వ్యూహం, అండదండలు ఉన్నట్లుగా స్పష్టమౌతుంది. కావూరి కూడా అవకాశం వచ్చింది కదా, అది ఎందుకైనా ముందు ముందు ఉపయోగపడుతుందన్న ధోరణిలో విభ‌జ‌న పాపం కాంగ్రెస్‌దేన‌ని స్వరం పెంచుతున్నాడు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ