Advertisementt

హీరోయిన్స్‌ను రిపీట్‌ చేస్తున్న స్టార్ హీరోలు!

Fri 16th Sep 2016 10:21 PM
star heroes,heroines,repeat,tollywood industry  హీరోయిన్స్‌ను రిపీట్‌ చేస్తున్న స్టార్ హీరోలు!
హీరోయిన్స్‌ను రిపీట్‌ చేస్తున్న స్టార్ హీరోలు!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో ఇప్పటివరకు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ రేణుదేశాయ్‌ని తప్ప ఎవ్వరినీ రిపీట్‌ చేయలేదు. కానీ త్వరలో డాలీ దర్శకత్వంలో ఆయన చేయబోయే 'కాటమరాయుడు' చిత్రంలో 'గబ్బర్‌సింగ్‌' భామ శృతిహాసన్‌ను రిపీట్‌ చేస్తున్నాడు. ఇక తనతో నటించిన హీరోయిన్లకు మరలా మరలా అవకాశాలు ఇచ్చే నటసింహం బాలకృష్ణ 'లెజెండ్‌' తర్వాత రాధికాఆప్టే, సోనల్‌చౌహాన్‌లకు 'లయన్‌', 'డిక్టేటర్‌' చిత్రాలలో వారికి అవకాశం ఇచ్చాడు. ఇక తాజాగా తన100వచిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో శ్రియతో కలిసి నటిస్తున్నాడు. వీరిద్దరు గతంలో 'చెన్నకేశవరెడ్డి' చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన 'బాబు బంగారం' చిత్రంలో కూడా వెంకీ తనకు కలిసివచ్చిన నయనతారతో ఆడిపాడాడు. ఇక ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఆయన సమంతతో 'జనతాగ్యారేజ్‌'తో సహా నాలుగుచిత్రాల్లో కలిసి నటించాడు. ఇలా మన హీరోలు తమకు నచ్చిన, తమని మెప్పించిన హీరోయిన్లను మరలా మరలా రిపీట్‌ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇది ఆయా చిత్రాలపై క్రేజ్‌ రావడానికి ఎంతో ఉపయోగపడుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ