Advertisementt

అవసరాల అవసరం పెరుగుతుంది..!

Fri 16th Sep 2016 07:08 PM
srinivas avasarala,director and actor avasarala srinivas,jyo achyutananda  అవసరాల అవసరం పెరుగుతుంది..!
అవసరాల అవసరం పెరుగుతుంది..!
Advertisement
Ads by CJ

నటునిగా, దర్శకునిగా ద్విపాత్రాభినయం చేస్తోన్న టాలెంటెడ్‌ పర్సన్‌ శ్రీనివాస్‌ అవసరాల. ఆయన నిర్మాత సాయికొర్రపాటికి చెందిన వారాహి చలన చిత్రం సంస్దలో 'ఊహలు గుసగుసలాడే' చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి గాను ఆయన నెలజీతం కింద మొత్తం 15లక్షలు పారితోషికంగా తీసుకున్నాడు. ఇక తన రెండో చిత్రం 'జ్యో అచ్యుతానంద' కోసం ఆయన రూ.60లక్షలు పారితోషికం తీసుకున్నాడు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తోంది. ఇక తన కొలీగ్‌ నాని హీరోగా శ్రీనివాస్‌ అవసరాల మూడో చిత్రంగా రూపొందుతోంది.ఈ చిత్రానికిగాను అతను ఏకంగా రూ.2.5కోట్లు పారితోషికం అందుకోనున్నాడని తెలుస్తుంది. ఇక నటునిగా కూడా పలు చిత్రాలలో ఆయన నటిస్తున్నాడు. 'అష్టాచెమ్మ, ఊహలు గుసగుసలాడే, నాన్నకు ప్రేమతో, జెంటిల్‌మేన్‌' చిత్రాలలో నటించాడు. మొత్తానికి శ్రీనివాస్‌ అవసరాల జోరు చూస్తుంటే మరో రెండు మూడు హిట్‌ చిత్రాలతో స్టార్‌ అండ్‌ ఫీల్‌గుడ్‌ మూవీస్‌కు కేరాఫ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ