Advertisementt

నాగ చైతన్య సూపర్ స్పీడ్..!

Fri 16th Sep 2016 06:59 PM
naga chaitanya,naga chaitanya movies,two new movies to naga chaitanya,chaitu,kalyan krishna,krishna director  నాగ చైతన్య సూపర్ స్పీడ్..!
నాగ చైతన్య సూపర్ స్పీడ్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరో నాగచైతన్య తన దృష్టి మొత్తం కెరీర్‌ మీదనే పెట్టాడు. సమంతతో ప్రేమాయణం నడుపుతూనే తన కెరీర్‌ను వేగవంతం చేస్తున్నాడు. ఆయన చందుమొండేటి దర్శకత్వంలో తీసిన మలయాళ సంచలన చిత్రం 'ప్రేమమ్‌'ను అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతూ సరసన శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత చైతూ.. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా విడుదలకు రెడీ అయింది. ఈ రెండు చిత్రాలు కొద్దిపాటి గ్యాప్‌తో విడుదలకు సిద్దమవుతున్నాయి. కాగా ఈ రెండు చిత్రాల తర్వాత చైతూ మరో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడు. అందులో ఒకటి 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'ఒకసారి ఇటు చూడవే' అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించనుంది. అలాగే కృష్ణ అనే మరో కొత్త దర్శకుడితో నాగచైతన్య మరో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్‌ప్రొడక్షన్స్‌ సంస్ద నిర్మిస్తోంది. హీరోయిన్‌గా లావణ్యత్రిపాఠిని అనుకుంటున్నారు. మొత్తానికి రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉండగా, మరో రెండు చిత్రాలను నాగచైతన్య లైన్‌లో పెట్టడం విశేషంగా చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ