Advertisementt

మురుగదాస్‌ మరో భామని ఎందుకు దాస్తున్నాడు?

Fri 16th Sep 2016 06:55 PM
  మురుగదాస్‌ మరో భామని ఎందుకు దాస్తున్నాడు?
మురుగదాస్‌ మరో భామని ఎందుకు దాస్తున్నాడు?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో ఎక్కువగా అంచనాలు ఏర్పడిన చిత్రాలలో మహేష్‌బాబు-మురుగదాస్‌ల సినిమా ఒకటి. కాగా ఇందులో మహేష్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మహేష్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌ ఫిలింగా రూపొందించేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో మహేష్‌తో కలసి ఓ హీరోయిన్‌ కొన్ని ముఖ్య సన్నివేశాలలో కనిపించనుంది. మొదట్లో ఈ చిత్రంలోని ఆ పాత్రలో మహేష్‌ శ్రీమతి నమ్రతా నటించనుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్‌లోకి నయనతార ఎంటర్‌ అయిందని సమాచారం. ఈ పాత్రను నయనతార చేస్తే తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి మరింత క్రేజ్‌ వస్తుందని భావించిన దర్శకుడు మురుగదాస్‌ ఈ విషయంతో నయనను తీసుకోనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో నయన నటిస్తే ఈ చిత్రానికి మరింత క్రేజ్‌ రావడం ఖాయమని భావించిన నిర్మాతలు నయన కోసం ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే..మా చిత్రం లో రకుల్ తప్ప మరో హీరోయిన్ లేదని డైరెక్టర్ మురుగదాస్ చెబుతున్నా.. కథ లో మెయిన్ పార్ట్ ఇంకో హీరోయిన్ తో ముడిపడి ఉండటం తో..కావాలనే మరో హీరోయిన్ లేదని చెబుతున్నారని, సినిమా రిలీజ్ వరకు గుప్తంగా దాచాలనుకున్న విషయం ఇలా బయటికి రావడం వల్లే..డైరెక్టర్ ఇలా చెబుతున్నాడని అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ