Advertisementt

సగం..మహేష్‌బాబు, కొరటాలకే...!

Fri 16th Sep 2016 02:47 PM
mahesh babu,koratala siva,dvv danayya,mahesh babu remuneration to dvv danayya movie  సగం..మహేష్‌బాబు, కొరటాలకే...!
సగం..మహేష్‌బాబు, కొరటాలకే...!
Advertisement
Ads by CJ

త్వరలో సీనియర్‌ నిర్మాత డివివి దానయ్య బేనర్‌లో మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటించేందుకు మహేష్‌ ఏకంగా 25కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడని సమాచారం. ఇక 'జనతాగ్యారేజ్‌'కు రూ.10కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకున్న కొరటాల శివ తాజా చిత్రం కోసం మరో 5కోట్లు పెంచి రెమ్యూనరేషన్‌గా రూ. 15కోట్లు తీసుకుంటున్నాడట. అంటే టాలీవుడ్‌ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న డైరెక్టర్‌గా కొరటాల చేరనున్నాడు. ఈ చిత్ర హీరో, దర్శకులకు కలిపే ఏకంగా రూ.40కోట్లు రెమ్యూనరేషన్‌ను ఖర్చుపెడుతున్న దానయ్య మరి సినిమా మొత్తం పూర్తయ్యే సరికి ఎంత బడ్జెట్‌ను ఈ చిత్రం క్రాస్‌ చేస్తుందోనని, ఎంత ఖర్చు చేస్తాడో అని సినీ ట్రేడ్‌ వర్గాలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రం పూర్తయ్యేసరికి 100 కోట్ల పైనే బడ్జెట్‌ ఖర్చయేలా ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మొదటి మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టిన కొరటాల ఎంతడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు క్యూలో ఉన్నారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ