Advertisementt

లావణ్య లక్కీ హీరోయిన్ అంతే..!

Fri 16th Sep 2016 02:41 PM
lavanya tripathi,lucky heroine,lavanya tripathi movie,lavanya in naga chaitanya movie  లావణ్య లక్కీ హీరోయిన్ అంతే..!
లావణ్య లక్కీ హీరోయిన్ అంతే..!
Advertisement
Ads by CJ

యువ హీరోయిన్‌, నాలుగేళ్ల కిందట 'అందాల రాక్షసి'తో పరిచయమైన హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి. ఈచిత్రం కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించనప్పటికీ తాను ఇప్పటివరకు చేసిన ఆరు చిత్రాలలో నాలుగు సూపర్‌హిట్‌చిత్రాల్లో నటిస్తూ గోల్డెన్‌ లెగ్‌ ముద్ర వేసుకొంది. స్టార్‌హీరోల సరసన పెద్దగా అవకాశాలు రానప్పటికీ యంగ్‌ హీరోల పాలిట ఆమె స్టార్‌ హీరోయిన్‌ ముద్ర వేయించుకుంది. సీనియర్‌స్టార్‌ నాగార్జున సరసన నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా', 'భలే భలే మగాడివోయ్‌', 'శ్రీరస్తు.. శుభమస్తు' వంటి వరుస విజయాలతో ఆమె దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఈ భామ మెగా హీరో అయిన వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్' చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా నాగచైతన్య హీరోగా 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్‌ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కీలకమైన ఓ సెకండ్‌ హీరోయిన్‌గా లావణ్యత్రిపాఠి నటిస్తోంది. మొత్తానికి యంగ్‌ హీరోల సరసనే కాకుండా స్టార్‌హీరోలతో నటించాలని, స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకుని పారితోషికం కూడా పెంచాలని ఈ భామ భావిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ