పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలను కూడా వదలనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు పవన్ ఇలా ప్రకటించక ముందు రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు.. సినిమాలను నిర్లక్ష్యం చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ వీరి అనుమాలను పటా పంచలు చేస్తూ.. నేను డబ్బు కోసమైనా సినిమాల్లో నటించాలి లేకుంటే నా దగ్గర డబ్బులు లేవని క్లియర్ చేసేసాడు. ఇంకేముంది అతను ఒప్పుకున్న సినిమాలన్నీ వరసబెట్టి లైన్లోకొచ్చేశాయి. అయితే ముందు అనుకున్న ప్రకారం శరత్ మరార్ నిర్మాతగా 'కాటమరాయుడు' సినిమా తెరకెకెక్కించాలని పవన్ అనుకుంటున్నాడట. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ దగ్గర నుండి హీరోయిన్ వరకూ అందరూ సెట్ అయినా పవన్ కన్ఫ్యూజన్ వల్ల ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా లేట్ అయ్యింది. ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడడం వల్ల చాలా నష్టం జరిగిందని అంటున్నారు. మొదట నష్టపోయింది మాత్రం ఈ సినిమాకి హీరోయిన్ గా తీసుకున్న శృతి హాసన్ అంట. అదేలా అంటే ఈ సినిమాకి శృతి హాసన్ జూన్ నుండే డేట్స్ ఇచ్చేసిందట. అయితే ఈ సినిమా లేట్ వల్ల ఆ డేట్స్ అన్ని శృతికి వేస్ట్ అయిపోయాయని... ఈ గ్యాప్ లో ఆ డేట్స్ వేరే సినిమాకి ఇచ్చుంటే ఆ సినిమా ఇప్పటికి పూర్తయిపోయేదని అంటున్నారు. కానీ శృతి మాత్రం పెదవి విప్పి ఎక్కడా చెప్పడం లేదంట. ఏం చేస్తుందిలే.... ఐరెన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మార్చిన హీరో పవన్ కదా అందుకే నోరు మెదపకుండా అడ్జెస్ట్ అవుతుందని అంటున్నారు. పాపం వాయిదాల మీద వాయిదాలు పడితే పడింది గాని ఎట్టకేలకు ఈ సినిమా ఉంటుందని త్వరలోనే పట్టాలెక్కిస్తామని ఆ చిత్ర నిర్మాత చెబుతుండటం తో ఫ్యాన్స్ హ్యాపీగా వున్నారు.