నందమూరి నటసింహం బాలకృష్ణ.. క్రిష్ దర్శకత్వంలో తన 100వ చిత్రంగా రెండో శతాబ్దపు మహారాజైన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా అదే పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్రంలో వచ్చే యుద్ద సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో హేమమాలిని.. బాలయ్యకు అమ్మగా అంటే గౌతమి పాత్రలో నటిస్తోంది. మరోవైపు బాలయ్య సరసన వశిష్టదేవి పాత్రలో ఇటీవల విడుదలైన చేసిన శ్రియా లుక్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. తాజాగా ఈచిత్రం ఫస్ట్‌లుక్ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు క్రిష్ ఆరాటపడుతున్నారు. 'బాహుబలి' తరహాలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కూడా గ్రాండియర్ లుక్‌తో ఉంటుందని, ఇందులో వచ్చే గ్రాఫిక్ వర్క్స్, యుద్ద సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య గెటప్, సంక్రాంతి సెంటిమెంట్, బాలయ్య నటిస్తోన్న 100 వ చిత్రం కావడం...ఇలా పలు ప్రత్యేకతలతో ఈ చిత్రం రూపొందుతోంది.