Advertisementt

బన్నీ చేత కూడా మంత్రాలు చదివిస్తాడంట!

Thu 15th Sep 2016 04:56 PM
allu arjun,duvvada jagannadham,ntr,adurs,harish shankar,brahmin  బన్నీ చేత కూడా మంత్రాలు చదివిస్తాడంట!
బన్నీ చేత కూడా మంత్రాలు చదివిస్తాడంట!
Advertisement
Ads by CJ

'అదుర్స్‌' చిత్రంలో పురోహితుడు 'చారి' పాత్ర ఎంతగాపేలిందో, ప్రేక్షకులను ఎంతగా ఆట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, బ్రహ్మానందం ట్రాక్‌ ఈ చిత్ర విజయానికి ఆయువుపట్టుగా నిలిచింది. వాస్తవానికి ఈ ట్రాక్‌ రాసింది దర్శకుడు హరీష్‌శంకర్‌ అని తెలుస్తోంది.ఈ చిత్రానికి హరీష్‌శంకర్‌ ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశాడు. ఆ ట్రాక్‌ను హరీషే డిజైన్‌ చేశాడని సమాచారం. కాగా 'అదుర్స్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన 'చారి' పాత్ర టైప్‌లోనే హరీష్‌ శంకర్‌ .. బన్నీ పాత్రను డిజైన్‌ చేస్తున్నాడని సమాచారం. దిల్‌రాజు నిర్మాతగా అల్లుఅర్జున్‌ హీరోగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న 'డీజె' (దువ్వాడ జగన్నాథం)లో బన్నీ ఓ బ్రాహ్మణ యువకునిగా కనిపించనున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రం త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. మరి ఎన్టీఆర్‌తో చేసిన మ్యాజిక్‌ను హరీష్‌శంకర్‌ బన్నీతో కూడా చేయించి మెప్పిస్తాడా? లేదా?అన్న విషయం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ