Advertisementt

‘ఒకసారి ఇటు చూడు’ కే చైతూ ప్లాట్!

Thu 15th Sep 2016 03:11 PM
naga chaitanya,kalyan krishna,soggade chinni nayana,okasari itu choodu  ‘ఒకసారి ఇటు చూడు’ కే చైతూ ప్లాట్!
‘ఒకసారి ఇటు చూడు’ కే చైతూ ప్లాట్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వరుసగా రెండో సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే చేస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున డ్యూయల్ రోల్ గా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి, అనుష్క, అనుసూయ వంటి తారలతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాన్ని తెరకెక్కించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే నాగచైతన్య హీరోగా త్వరలో సినిమా రెడీ అవుతుందని నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈ  చిత్రానికి ఇప్పటికే కథా కథనాలకు సంబంధించిన చర్చలు జరిగాయని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని కూడా తెలిపాడు.

అయితే ఈ సినిమాకు టైటిల్ గా నాగార్జున సినిమా ‘నిన్నే పెళ్లాడతా’ను పెట్టాలని మొదట భావించినా.. ఆ తర్వాత ఆ టైటిల్ పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబందించి  'ఒకసారి ఇటు చూడు' అనే  పేరును ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ టాక్. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన మొదటి సినిమా వలెనే ఈ చిత్రానికి కూడా మంచి రొమాంటిక్ టైటిల్ ను పెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీ టైటిల్ 'ఒకసారి ఇటు చూడు' నే అవుతుందా..లేక మరో పేరు తెరపైకి వస్తుందా అనేది చిత్ర యూనిట్ తెలియపర్చాల్సి వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ