Advertisementt

నయనకు విలన్‌ ఆ దర్శకుడేనంట..!

Thu 15th Sep 2016 02:44 PM
gautam menen,villain,nayanthara,imaika nodigal  నయనకు విలన్‌ ఆ దర్శకుడేనంట..!
నయనకు విలన్‌ ఆ దర్శకుడేనంట..!
Advertisement
Ads by CJ

తన చిత్రాల ద్వారా కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా విభిన్నచిత్రాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్‌. కాగా ఈ ప్రముఖ దర్శకుడు ప్రస్తుతం ఓ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈచిత్రంలో అధర్వ హీరోగా నటిస్తుండగా అతనికి పోటాపోటీ పాత్రలో నయనతార కీలకపాత్రను పోషిస్తోంది. జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. టైటిల్‌  'ఇమైకా నోడిగల్‌'. ఇందులో విలన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో ఈ చిత్రం కథ విన్నవెంటనే గౌతమ్‌ వాసుదేవమీనన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. కాగా ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ తెలుగులో నాగచైతన్య హీరోగా , తమిళంలో శింబు హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో'చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీనితర్వాత ఆయన నాలుగుభాషల్లో ఓ మల్టీస్టారర్‌ చిత్రం ప్లాన్‌ చేస్తున్నాడు. అదీ తన స్వీయనిర్మాణంలో. తెలుగులో సాయిధరమ్‌తేజ్‌, మలయాళంలో పృధ్వీరాజ్‌, కన్నడలో పునీత్‌రాజ్‌కుమార్‌లు హీరోలుగా నటించనున్నారు. ఇక తమిళంలో ఈ చిత్రాన్ని శింబు లేదా జయం రవిలలో ఒకరు చేసే అవకాశం ఉంది. ఆయన మొదట రామ్‌చరణ్‌, బన్నీల దగ్గరకు వెళ్లాడు. వారు సరిగా స్పందించకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన గౌతమ్‌ ప్రస్తుతం నాలుగుభాషల్లో రూపొందే చిత్రాన్ని తనస్వీయ నిర్మాణంలోనే చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ