Advertisementt

నిజమేనా.. చరణ్.. ఇది నిజమేనా..!

Thu 15th Sep 2016 02:34 PM
ram charan,maniratnam,ram charan with maniratnam,ram charan movies list  నిజమేనా.. చరణ్.. ఇది నిజమేనా..!
నిజమేనా.. చరణ్.. ఇది నిజమేనా..!
Advertisement
Ads by CJ

దక్షిణాది భాషల్లో క్రియేటివ్‌ జీనియస్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మణిరత్నం. జయాపజయాలకు అతీతంగా ఆయన ఇప్పటికే చాలామంది స్టార్స్‌తో పనిచేశారు. అంతేకాదు.. నేటితరం స్టార్‌ హీరోలు కూడా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఉబలాటపడుతుంటారు. కాగా మణిరత్నం గతంలో తీసిన 'ఓకే బంగారం' చిత్రంలో చాన్స్‌ వచ్చినా దానికి రామ్‌చరణ్‌ నో చెప్పాడనే వార్తలువచ్చాయి. కాగా త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ఓ పక్కా కమర్షియల్‌ చిత్రం రూపొందునుందని, ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని అత్యంత విశ్వసనీయ సమాచారం. కాగా ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌ సైతం ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రామచరణ్‌ 'ఎవడు' చిత్రంలో కూడా బన్నీ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారనేది ఫిల్మ్‌నగర్‌ హాట్‌ టాపిక్‌గా చెప్పుకుంటున్నారు. కాగా ప్రస్తుతం రామ్‌చరణ్‌.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈచిత్రం తర్వాత చరణ్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడు. దాని తర్వాత చరణ్‌ - మణిరత్నంల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ