Advertisementt

'జనతా గ్యారేజ్' గూబ గుయ్యమనే హిట్!

Wed 14th Sep 2016 09:50 PM
janatha garage,sensational hit,janatha garage success meet,kalyan ram,ntr,koratala,janatha success range  'జనతా గ్యారేజ్' గూబ గుయ్యమనే హిట్!
'జనతా గ్యారేజ్' గూబ గుయ్యమనే హిట్!
Advertisement
Ads by CJ

'జనతా గ్యారేజ్' కలెక్షన్స్ పరంగా దూసుకు పోతూ కొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ చిత్రం గా నిలిచిందని అందరూ అంటున్నారు. కొరటాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సక్సెస్ పరంగా, కలెక్షన్స్ పరం గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఈ చిత్ర విజయం పట్ల హ్యాపీగా ఫీలై.... చిత్ర యూనిట్ కి, పాత్రికేయులకు థాంక్స్ మీట్ పెట్టి మరి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక అభిమానులకు స్పెషల్ గా 'జనతా గ్యారేజ్' సక్సెస్ మీట్ పెట్టాడు. ఈ సక్సెస్ మీట్ కి 'జనతా గ్యారేజ్' యూనిట్ తో సహా సుకుమార్, కళ్యాణ్ రామ్ వంటి వారు హాజరయ్యారు. ఈ మీట్ లో ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భం గా ఎన్టీఆర్ మాట్లాడుతూ నాకు ఇంత విజయం రావడానికి... వెలుగు రావడానికి 13 సంవత్సరాలు పట్టిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడి అందరి హృదయాల్ని కదిలించాడు. విజయాన్ని ఆస్వాదిస్తుంటే నిజం గా కన్నీళ్లు వచ్చేస్తున్నాయని.... నేను ఉన్నంత కాలం మీ ప్రేమ అనురాగాలు నాకు లభించాలని కోరుకుంటున్నాని చెప్పాడు. అటు అభిమానులకు, ఇటు జన్మనిచ్చిన తల్లితండ్రులకు అద్భుతమైన ఆనందాన్ని పంచానంటూ మనసులో మాట చెప్పుకొచ్చాడు. ఇక ఈ సక్సెస్ మీట్ కి హాజరైన కళ్యాణ్ రామ్  మాట్లాడుతూ... అభిమానులనుద్దేశించి మీ ఆకలి తీరిందా.... నాది నా తమ్ముడి ఆకలి తీరింది ఈ సినిమా హిట్ తో అని అన్నాడు. మేమిద్దరం గత మూడేళ్ళుగా ఎప్పుడు మాట్లాడుకున్నా 'గూబ గుయ్యమనే' హిట్ ఎప్పుడు కొడతామా  అని మాట్లాడుకునే వాళ్లమని చెప్పాడు. అలాంటి హిట్ కొడితే ఎలా ఉంటుందో 'జనతా గ్యారేజ్' నిరూపించింది అని అన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ