Advertisementt

'సాహసం శ్వాసగా సాగిపో' పరిస్దితి ఏంటి?

Wed 14th Sep 2016 09:26 PM
sahasam swasagaa sagipo movie,gautham menen,naga chaitanya,release problems,simbu  'సాహసం శ్వాసగా సాగిపో' పరిస్దితి ఏంటి?
'సాహసం శ్వాసగా సాగిపో' పరిస్దితి ఏంటి?
Advertisement
Ads by CJ

గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబులు హీరోగా మంజిమామోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని, కానీ ఆర్డిక కారణాల వల్ల ఎప్పుడో విడుదలకావాల్సిన ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకాలేదనే వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ సినిమా అసలు ఇంకా పూర్తికాలేదన్నది వాస్తవం అని తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ షూటింగ్‌ పూర్తయినప్పటికీ తమిళ హీరో శింబు కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఇంత లేటు అవ్వడానికి అసలైన విషయం అని వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ చిత్రం తమిళవెర్షన్‌కు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. అసలే సమయపాలన లేని శింబు ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఒకే లోకేషన్‌లో తెలుగు, తమిళ వెర్షన్స్‌ తీయడం గౌతమ్‌మీనన్‌ స్టైల్‌. కానీ శింబు వల్ల అది సరిగా చేయలేకపోయాడు దర్శకుడు గౌతమ్‌మీనన్‌. మధ్యలో శింబు బీప్‌సాంగ్‌ వివాదంతో పాటు శింబు పలు వివాదాల కారణంగా షూటింగ్‌ పూర్తి చేసుకోలేకపోయింది. కానీ అందరూ ఈ చిత్రం ఆర్దిక కారణాల వల్ల విడుదల కాలేదని అనుకుంటున్నారు. కాగా ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడం గౌతమ్‌తో సహా అందరు టెన్షన్‌ ఫీలవుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఏమాత్రం టెన్షన్‌ పడటం లేదట. ఇలా అనేక అవాంతరాలు ఎదుర్కొన్న ప్రతిసారి గౌతమ్‌కు సినిమా హిట్‌ అవుతుందని, రిలాక్స్‌గా ఉండమని  చైతు చెబుతున్నాడట. మరో పక్క నాగచైతన్య నటించిన 'ప్రేమమ్‌' రెడీ కావడంతో కొంత కాలం 'సాహసం శ్వాసగా సాగిపో' విషయం చైతు ఆలోచించడం మానేసి 'ప్రేమమ్‌'ను అక్టోబర్‌7న రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ