Advertisementt

ఇక నాగ్ దృష్టంతా..తనయులపైనే..!

Wed 14th Sep 2016 05:47 PM
akkineni nagarjuna,nag,naga chaitanya,akhil,mek,soggade chinni nayana,manam,vikram kumar,kalyan krishna  ఇక నాగ్ దృష్టంతా..తనయులపైనే..!
ఇక నాగ్ దృష్టంతా..తనయులపైనే..!
Advertisement
Ads by CJ

వ్యక్తిగత జీవితంపైనే కాకుండా కెరీర్‌పరంగా కూడా తన తనయులైన నాగచైతన్య, అఖిల్‌లకు నాగ్‌ సహాయం చేస్తున్నాడు. త్వరలో తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసి మామగారిగా మారుతోన్ననాగ్‌... నాగచైతన్య కోసం 'సోగ్గాడే చిన్నినాయనా' ఫేమ్‌ కళ్యాణ్‌కృష్ణతో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక అఖిల్‌ రెండో చిత్రాన్ని 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ చేతిలో పెట్టాడు. కాగా తాజాగా నాగ్‌.. నాగచైతన్య నటిస్తున్న'ప్రేమమ్‌' చిత్రంలోక్లైమాక్స్‌లో వచ్చే కీలక సన్నివేశాలకు వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నాడు. ఇది ఈ చిత్రానికి బాగా హెల్ప్‌ అవుతుందని భావిస్తున్నారు. కాగా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మలయాళ రీమేక్‌లో శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోనా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు. ఈనెల 20వ తేదీన ఈ చిత్రం ఆడియోను ఘనంగా నిర్వహించనున్నారు. చిత్రాన్ని అక్టోబర్‌7న విడుదలకు సిద్దం చేస్తున్నారు. మొత్తానికి కోట్ల పారితోషికం అందించే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను కూడా కాదని, తండ్రిగా నాగ్‌ తన స్దానాన్ని పూర్తి చేసే పనిలో భాగంగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ