కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు షూటింగ్ మొదలు పెట్టకుండానే తమ చిత్రాలకు మంచి మంచి క్రేజీ టైటిల్స్‌ను రిజిష్టర్ చేసి అందరిలో ఆసక్తిపెంచుతున్నారు. అశ్వనీదత్ తన బేనర్‌లో 'జగదేకవీరుడు' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడు. ఇక రవితేజ, బాబిల కాంబినేషన్ చిత్రానికి 'క్రాక్' అనే టైటిల్ రిజిష్టర్ అయింది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ తన బేనర్‌లో తాజాగా 'బాక్సర్' అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడు. మరి ఈ టైటిల్ తన కోసం రిజిష్టర్ చేయించాడా? లేక తన తమ్ముడు ఎన్టీఆర్ చిత్రం కోసం రిజిష్టర్ చేయించాడనే విషయం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఇక త్వరలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాతగా, కరుణాకారన్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి 'క్రేజీ ఫీలింగ్' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడు. గతంలో ఇదే బేనర్‌లో 'ఎందుకంటే ప్రేమంట' అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు తేజ తాను రానాతో చేయబోయే చిత్రానికి 'నేనే రాజు.... నేనే మంత్రి' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. మొత్తానికి క్రేజీ టైటిల్స్‌తో అందరి దృష్టి తమ చిత్రంపై పడేందుకు యూనిట్ సభ్యులు బాగానే పాకులాడుతున్నారని చెప్పవచ్చు.