యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' విడుదలైన రోజు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కూడా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరం గా దూసుకుబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'జనతా గ్యారేజ్' నిలిచింది. అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి... మిశ్రమ స్పందన రావడానికి కారణం మాత్రం బెన్ఫిట్ షో లే అని 'జనతా గ్యారేజ్' దర్శకుడు శివ చెబుతున్నాడు. కొరటాల శివ 'జనతా గ్యారేజ్' బెన్ఫిట్ షో ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. అసలెందుకు ఇలా అన్నాడంటే బెన్ఫిట్ షో లు అంటే అభిమానుల కోసం అర్ధరాత్రి 3 గంటల సమయానికి వేస్తారు కాబట్టి... అప్పటిదాకా అభిమానులంతా తమ అభిమాన హీరో చిత్రం చూడడానికి ఆనందం తో నిద్రలేకుండా మేలుకుని సెలెబ్రేషన్స్ చేసుకుంటారని.... ఇక నిద్ర లేకుండా సినిమా చూస్తే అది సరిగ్గా అర్ధం కాక దాని గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నారని శివ అభిప్రాయపడుతున్నాడు. 'జనతా గ్యారేజ్' విషయం లో ఇదే జరిగిందని శివ అంటున్నాడు. అందువల్లే అభిమానులు 'జనతా గ్యారేజ్' ని సరిగా జడ్జ్ చెయ్యలేక మిశ్రమ టాక్ స్ప్రెడ్ అయ్యిందని అంటున్నాడు శివ. అంటే కేవలం అభిమానులు, ప్రేక్షకులు నిద్రలేని తనం తోనే సినిమా చూసి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనేగా శివ అభిప్రాయం. అభిమాన హీరోల కోసం అభిమానులు ఎంతో కష్టపడి బేనర్లు కట్టి.. తమ హీరో సినిమా హిట్ అవ్వాలని గుళ్లో పూజలు చేసి... బెన్ఫిట్ షో ఎప్పుడెప్పుడు వేస్తారా అని ఎదురు చూసే అభిమానులకు కొరటాల మాటలు కొంచెం కష్టం కలిగించేవే. ఏ హీరో అభిమాని కూడా తమ హీరో సినిమా పోయింది అని చెప్పుకోరు..ఇది గమనిస్తే కొరటాల శివ కి ఎంతో మంచిది. ఒక్క బెన్ఫిట్ షో నే కాదు మార్నింగ్ షో కి కూడా అదే టాక్. మార్నింగ్ అనే కాదు..ఇప్పటికి జనతా లో ఏముంది అనేవారు కూడా వున్నారు. కానీ మొదటి నుండి శివ ఎంత నమ్మకంగా వున్నాడో..అంతే నమ్మకం తో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై వున్నారు. ఈ విషయం లో కొరటాల శివ తన అభిప్రాయం మార్చుకుంటే మంచిది.