టాలీవుడ్ లో హిట్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మొదటి స్థానం లో రకుల్ నిలబడుతుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి సినిమాలుగా పేరు పొందుతున్నాయి కానీ బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేకపోతున్నాయి. అయినప్పటికీ ఆమె ప్రతి ఒక్క హీరోతో నటిస్తూ నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోతోంది. చిన్న హీరోల సినిమాల్లో సోలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్ క్రమం గా పెద్ద హీరోలతో కూడా సోలో హీరోయిన్ గా దూసుకుపోతూ సమంత, కాజల్, తమన్నాలకు చెక్ పెట్టేసింది. రకుల్ ఇప్పుడు దాదాపు 4 నుండి 5 సినిమాలు చేతిలో పెట్టుకుని బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో రెండో హీరోయిన్ గా కూడా చేసిన ఈ భామ..ఇప్పుడు మాత్రం సోలో హీరోయిన్ గానే దున్నేస్తుంది. తాజాగా ఆమె 'ధృవ' లో రామ్ చరణ్ సరసన నటిస్తుండగా... మరో పక్క మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పక్కన కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక మహేష్ సినిమా ఎలాగూ చేతిలో వుంది. ఇన్ని సినిమాల్లో నటిస్తూనే అక్కినేని కాంపౌండ్ లో కూడా కాలుమోపింది. కళ్యాణ్ కృష్ణ - నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చే చిత్రం లో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే ఇక్కడ అమ్మడు ఎప్పటిలాగా సోలో హీరోయిన్ కాదండోయ్... ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఆ రెండో హీరోయిన్ ఎవరో కాదు.. 'మనం' సినిమాలో గెస్ట్ రోల్ లో, 'సోగ్గాడే చిన్నినాయనా' లో ఫుల్ రోల్ లో కనిపించిన లావణ్య త్రిపాఠి అంట. అయితే నాగ చైతన్య ఈ సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చెయ్యబోతున్నాడన్నమాట. ఇప్పటి వరకు సోలో హీరోయిన్ గా మాత్రమే అవకాశాలు ఒప్పుకుంటున్న రకుల్.. ఇప్పుడు లావణ్య తో కలిసి నటిస్తుండటంతో..రకుల్ పై ఇండస్ట్రీ లో మంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంచెం పేరొస్తే చాలు..తలకాయలు ఎగరేసే హీరోయిన్ లు వున్న ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ముద్ర పడినా.. పెద్ద, చిన్న హీరోలతో పాటు..ఇలా ఇద్దరు హీరోయిన్ ల సినిమాలు కూడా చేయడానికి రకుల్ ఎటువంటి భేషజాలు పోకపోవడంతో.. ఇప్పుడు నిర్మాతల కళ్లన్నీ ఆమె పైనే వున్నాయి.