మిర్చి, శ్రీమంతుడు విజయాలతో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారాడు కొరటాల శివ. మూడో ప్రయత్నంగా ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదల రోజు ప్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్లతో సినిమా దమ్మేంటో చూపించింది. నాన్నకు ప్రేమతో సినిమా వరకు ఎన్టీఆర్ కెరీర్‌లో రూ.50 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రం లేదు. ఇప్పుడు జనతాగ్యారేజ్ కూడా 50 కోట్ల క్లబ్‌లో చేరింది. సక్సెస్ ఉన్న వారివైపే చిత్ర పరిశ్రమ దృష్టిసారిస్తుందన్నది వాస్తవం. ప్రస్తుతం కొరటాల శివ ఎప్పుడు టైమ్ ఇస్తాడా? అని హీరోలు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఆ క్యూ కట్టే నిర్మాతల్లో దాసరి నారాయణరావు కూడా ఉన్నారని వినికిడి. ఇటీవల ఆయన సన్నిహితులతో కొరటాలకు దాసరి కబురు పంపారట. ఆయన నిర్మాతగా ఓ సినిమా చెయ్యాలంటూ. మరి పెద్దాయన ఆఫర్‌కి శివ ఎలా స్పందిస్తాడో చూడాలి. దాసరి నిర్మాతగా పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా అనౌన్స్ అయ్యి ఉంది. కానీ దానికి ఇంకా దర్శకుడు ఎవరన్నది ఫిక్స్ కాలేదు. తివిక్రమ్ అనుకున్నారు కానీ తను చినబాబు బ్యానర్‌లో పవన్‌తో ఓ సినిమా చేసే పనిలో ఉన్నారు. డాలీ కాటమరాయుడుతో బిజీ. ఓ దాసరి నిర్మించే సినిమాకు కొరటాల శివను దర్శకుడిగా అనుకుంటున్నారని దాసరి సన్నిహితుల నుంచి సమాచారం.