ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో చెలరేగి పోతుంటాడు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. కానీ తాజాగా చేసిన ఆయన ట్వీట్స్ లో పవన్ కల్యాణ్ ను తెగ మెచ్చుకున్నాడు వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏ ఒక్కరూ కూడా తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు. నిజం చెప్పాలంటే పవన్ ను చిన్నచూపు చూసేవారంతా చెత్త ఆలోచనా విధానం ఉన్నవారేనన్నాడు. ఇంకా పవన్ గురించి ప్రస్తావిస్తూ పవన్ మంచి కమాండర్ అవుతాడని వెల్లడించాడు. కాగా పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ప్రసంగిస్తూ.. ఆంధ్రాకు ప్రత్యేక హోదా మీద భాజపా, కాంగ్రెస్, తెదేపాలను ఉతికి ఆరేసి సవాళ్ళు విసిరిన విషయం తెలిసిందే.
అయితే అటు తిరుపతి, ఇటు కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నేతలంతా గుర్రుగా ఉంటూ ప్రత్యోరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు భిన్నంగా రాంగోపాల్ వర్మ స్పందించడం ఆసక్తికరంగా ఉంది. కానీ రాం గోపాల్ వర్మ అంటే అందరికంటే భిన్నమైన ప్రముఖ వ్యక్తి కదా. కాగా 'ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిస్థితులపై పవన్ కల్యాణ్ కు ఉన్నంత అవగాహన, ఆయనకున్న అభిమానుల సంఖ్య ఎక్కువే. అందుకనే పవన్ కల్యాణ్ కమాండర్లకే కమాండర్ అవుతాడు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద కమాండర్ అయిన పవన్ మీద డర్టీ మైండ్ వాళ్ళు మాత్రమే తప్పుగా ఆలోచిస్తారన్నాడు'. తాజాగా వర్మ చేసిన ట్వీట్లు పవన్ భవిష్యుత్తును సూచించేలా ఉన్నాయి.