Advertisementt

ఏపీలో ఈసారి ముక్కోణమా? నాలుగు స్తంభాలాటా?

Mon 12th Sep 2016 03:09 PM
pawan kalyan,andhra pradesh,4 parties,2019 elections,janasena,tdp,congress,bjp,ysrcp  ఏపీలో ఈసారి ముక్కోణమా? నాలుగు స్తంభాలాటా?
ఏపీలో ఈసారి ముక్కోణమా? నాలుగు స్తంభాలాటా?
Advertisement
Ads by CJ

గత ఎన్నికల్లో టిడిపి, వైయస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు జరిగింది. పవన్‌ మద్దతు ఇచ్చిన బిజెపి, టిడిపిలు ఇక్కడ అక్కడ అధికారంలోకి వచ్చాయి. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. ఈసారి వచ్చే ఎన్నికల్లోనే కాదు... నవంబర్‌లోపు జరగాల్సిన నగరపాలక సంస్దల ఎన్నికల్లో సైతం పవన్‌ 'జనసేన' పోటీ చేయనుందని సమాచారం. ఇక పవన్‌ విషయానికి వస్తే ఆయన ఈసారి బిజెపి, టిడిపిలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. అలాగని జగన్‌కు సపోర్ట్‌ చేసే అవకాశాలు అసలే లేవు. దీంతో పవన్‌ కూడా ఒంటరిగా బరిలో నిలవాలని చూస్తున్నాడు. ఆయన రాకను వామపక్షాలు మాత్రం స్వాగతిస్తున్నాయి. ఎన్నికల్లో, ఉద్యమాల్లో పవన్‌ వెంట నడవడానికి ఉభయకమ్యూనిస్ట్‌ పార్టీలు ఆసక్తిని చూపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర స్దాయిలో క్షేత్రస్దాయిలో బలమైన వామపక్షాలకు సొంతంగా గెలిచే సత్తా లేకపోయినా గెలుపోటములను నిర్ణయించే సత్తా ఆ పార్టీలకు ఉంది. దీంతో ఎంతో ప్రజాదరణ ఉన్న పవన్‌ను నమ్మి ఆయన వెంట నడిస్తే మాత్రం ఈసారి నాలుగుస్తంభాలాట జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ